Adipurush: ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. ప్రభాస్ ను రాముడిగా చూసి మురిసిపోతున్నారు అభిమానులు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్. ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా కనిపిస్తుండగా.. రావణాసురుడుగా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ లో రావణాసురుడుకు రాముడుకు మధ్య జరిగిన యుద్ధాలను చూపించిన విషయం తెల్సిందే. టీజర్ రిలీజ్ అయ్యాకా రావణాసురుడును ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. అదంతా చిన్నపిల్లలు చూసే కార్టూన్ బొమ్మలుగా ఉన్నాయని, సైఫ్ రావణాసుడిగా సెట్ అవ్వలేదని, విఎఫ్ ఎక్స్ బాగోలేదని ట్రోల్ చేశారు.
Adipurush: అహంకారపు రొమ్ము చీల్చడానికి దూకండి ముందుకి…
ఇక నేడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తంలో సైఫ్ రెండు షాట్స్ కే పరిమితమయ్యాడు. సీతను ఎత్తుకెళ్లడానికి భిక్షాటనకు వచ్చిన మునిగా కనిపించాడు. చివర్లో రాక్షసుడుగా అభివర్ణిస్తుండగా అతని కళ్ళను చూపించారు తప్ప మొత్తంగా రావణాసురుడు విశ్వరూపాన్ని ట్రైలర్ లో చూపించింది లేదు. అయితే దానికి రెండు కారణాలు ఉన్నాయని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఒకటి .. రావణాసురుడు విజువల్స్ వలన టీజర్ పై చాలా నెగెటివిటి వచ్చింది. అందువల్లే ట్రైలర్ లో ఆ పాత్రకు సంబంధించినవి ఎక్కువ పెట్టలేదని.. ఇంకొకటి.. ఆంజనేయుడు తన రాముడు గురించి చెప్తున్నట్లు ట్రైలర్ కట్ చేయడంతో.. కేవలం రాముడిని మాత్రమే హైలైట్ చేయడానికి ట్రైలర్ మొత్తం ఆయనతో నింపేసి ఉంటారు. రావణాసురుడు పాత్రకు సంబంధించిన వీడియోను స్పెషల్ గా రిలీజ్ చేస్తారేమో అని అంటున్నారు. ఏది ఏమైనా టీజర్ లో ట్రోల్ చేసినట్లు ట్రైలర్ లో ట్రోల్ చేయకుండా మేకర్స్ జాగ్రత్త పడి లేపేసి ఉంటారని అభిమానులు అంటున్నారు. ఇక ట్రైలర్ కు అయితే మంచి పాజిటివ్ టాకే వస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.