Site icon NTV Telugu

Pushpa The Rule: సింహంతో సుక్కూ.. ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేసిన రష్మిక

Rashmika Sukumar

Rashmika Sukumar

Rashmika shares a majestic Sukumar pic from the sets of ‘Pushpa: The Rule’: డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతానికి పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప ది రైజ్ సినిమా సూపర్ హిట్ కావడంతో రెండవ భాగం మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే మొదటి భాగానికి నిర్మాతగా వ్యవహరించక పోయినా రెండో భాగానికి సుకుమార్ నిర్మాణ భాగస్వామి కూడా అయ్యాడు. నార్త్ లో సౌత్ నుంచి వస్తున్న సినిమాలకి భారీ ఎత్తున డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఒకరకంగా పుష్ప రెండో భాగాన్ని సుకుమార్ చెక్కుతున్నాడు. అవసరమైతే రీ షూట్స్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు.

Aditya Narayan: ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు దురుసు ప్రవర్తన.. అభిమానిని కొట్టి..

ఒకపక్క బిజీ బిజీగా షూట్స్ లో గడుపుతున్న సుకుమార్ ఫోటోని తాజాగా హీరోయిన్ రష్మిక మందన తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన ఫోటోలో సుకుమార్ ఒక సింహపు బొమ్మ మీద చేయి పెట్టి ఎవరితోనో నవ్వుతూ మాట్లాడటం కనిపిస్తోంది. ఇక ఈ పిక్ షేర్ చేసిన రష్మిక ఇది ఒక కాండిడ్ ఫోటో అని చెప్పుకొచ్చింది. ప్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అవుతుందని ముందే ప్రకటించారు. అయితే ఆ తేదీకి రిలీజ్ అవ్వడం కష్టమేనని ప్రచారం జరుగుతున్న సమయంలో ఖచ్చితంగా ఆ తేదీకి సినిమా రిలీజ్ అవుతుందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చింది. తాజాగా రష్మిక షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకెందుకు మీరూ చూసేయండి.

Exit mobile version