NTV Telugu Site icon

Rashmika Mandanna: రిటైర్‌మెంట్ తీసుకుందాం అనుకుంటున్న.. రష్మిక కామెంట్స్ వైరల్ !

Chava Movie

Chava Movie

ప్రజంట్ ఫుల్ ఫామ్‌లో సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన. అనతి కాలంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది గత రెండు, మూడేళ్లుగా వరుస భారీ హిట్ చిత్రాలతో దూసుకుపోతుంది. ‘యనిమల్’, ‘పుష్ప’.. ఈ రెండు చిత్రాలు తన కెరీర్‌నే మార్చేశాయి. బాష తో సంబంధం లేకుండా ఇప్పుడు వరుస చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఈ అమ్మడు నటిస్తున్న చిత్రాలో ‘ఛావా’ ఒకటి.

మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ పెద్ద‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రాబోతుండ‌గా. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో రష్మిక మహారాణి యేసు బాయి గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. కాగా ఈ ఈవెంట్‌ కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి వీల్ చైర్ మీద బయలుదేరి వెళ్లింది రష్మిక మంధాన.

ఇందులో భాగంగా రష్మిక మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.. ఈ చిత్రంలో నటించడం ద్వారా తాను ఎంత సంతృప్తి చెందిందో తెలియజేసింది..‘నా కెరీర్‌లో మహారాణి యేసుబాయి పాత్ర చాలా చాలా స్పెషల్. ఇలాంటి అవకాశం రావడం నా అదృష్టం. నేను బాగా నటించానని అనుకుంటున్నా. థియేటర్లలోకి వచ్చిన తర్వాత మీకు కూడా నా నటన నచ్చుతుందని అనుకుంటున్నాను… ‘ఛావా’ చూస్తుంటే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ మూవీ కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత నొప్పినైనా భరిస్తాను.. ఈ పాత్ర చేయడం వల్ల నేను ఈ మరాఠా కుటుంబంలో సభ్యురాలిగా అయినందుకు చాలా సంతోషంగా ఉంది.. ఇలాంటి ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న పర్వాలేదు. సంతోషంగా తీసుకుంటా’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.