Site icon NTV Telugu

Rashmika: ‘థామా’ హాట్ సాంగ్ వెనుక.. రహస్యాని రివీల్ చేసిన రష్మిక

Rashmika

Rashmika

గత కొన్ని రోజులుగా రష్మిక పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం, త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలు కారణంగా ఫ్యాన్స్‌ ఆమెపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో రష్మిక ఇటీవల విడుదలైన ‘థామా’ సాంగ్ గురించి ఓ ఆసక్తికరమైన వివరాన్ని పంచుకున్నారు. ఆమె ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌లో ఈ పాట వెనుక ఉన్న కథను వెల్లడిస్తూ, దర్శకనిర్మాతలు అనుకోకుండా తీసుకున్న నిర్ణయం వల్ల పాట ఇలా ఫైనల్‌ అయ్యిందని చెప్పారు.

Also Read : Rashi Khanna: తన డైట్‌పై రాశి ఖన్నా క్రేజీ కామెంట్స్..!

రష్మిక మాట్లాడుతూ.. ‘థామా’ షూటింగ్ కోసం 12 రోజుల పాటు ఒక అద్భుతమైన లొకేషన్‌లో పని చేశారు. చివరి రోజున దర్శకనిర్మాతలు ఆలోచన చెప్పారు, “ఈ ప్లేస్‌ ఇంత బాగుంది కదా, మనం ఇక్కడ పాట ఎందుకు చేయకూడదు?” అనే ఐడియా నచ్చింది. తర్వాత 3–4 రోజుల రిహార్సల్స్‌తో పాటను షూట్ చేశారు. ఫలితం చూసి అందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకంటే మొదట ప్లాన్ చేసిన వాటికంటే పాట మరింత బాగానే వచ్చింది. రష్మిక ఈ పాటలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలిపారు. ఆమె చెప్పారు, “మీరు థియేటర్‌లో ఈ సాంగ్‌ను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా.”

‘థామా’ సినిమాలో రష్మిక ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్నారు. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ చిత్రంలో ప్రేమ ప్రధాన కథాంశంగా ఉంటుందే కాకుండా, కొన్ని అద్భుతమైన, శక్తులతో కూడిన సీన్‌లు కూడా ఉంటాయి. ఈ సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, రష్మిక మరో సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ కూడా నవంబర్ 7న రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ రెండు చిత్రాలతో రష్మిక తన ప్రెజెన్స్‌ను బాలీవుడ్‌లో మరింత పటిష్టం చేసుకోవడానికి సన్నద్ధమవుతోంది.

Exit mobile version