Rashmika Mandanna:గీతా గోవిందం సినిమాతో తెలుగువారికి పరిచయమైంది రష్మిక మందన్న.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని నేషనల్ క్రష్ గా మారిపోయింది. వరుస అవకాశాలు.. వరుస హిట్లతో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది. రష్మిక కెరీర్ మొదలుపెట్టి ఐదేళ్లు అవుతోంది. ఈ ఐదేళ్లల్లో ఆమె ఎన్నో అవమానాలను, ఎదురుదెబ్బలను ఎదుర్కొంది. వీటితో పాటు ఎంతోమంది అభిమానుల ప్రేమను అందుకుంది. రష్మిక ని ఎంతమంది ట్రోల్ చేస్తారో అంతకు మించిన అభిమానులు ఆమెను ప్రేమిస్తారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే పద్దతిని రష్మిక కూడా పాటిస్తుంది. రెండు చేతులా సంపాదిస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటుంది అని చెప్పొచ్చు. ఇక ఈ నేపథ్యంలోనే రష్మిక ఈ ఐదేళ్లలో ఐదు ప్లాట్స్ కొన్నట్లు ఇక రూమర్ క్రియేట్ అయ్యింది. హైదరాబాద్, గోవా, కూర్గ్, ముంబై, బెంగుళూరు లాంటి ప్రదేశాలలో ఆమె కోట్లు విలువ చేస్తే అపార్ట్మెంట్స్ కొన్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Actress Hema: సుఖానికి అలవాటు అయ్యా.. అందుకే సినిమాలు మానేశా
ఇక ఈ రూమర్లకు రష్మిక చక్కని సమాధానంతో చెక్ పెట్టింది. ఐదేళ్లలో ఐదు లగ్జరీ ప్లాట్స్ కొన్న రష్మిక.. అని చెప్పిన సదురు పేజ్ ని ట్యాగ్ చేస్తూ “అది నిజమవ్వాలని నేను కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది అంతే కాకుండా ” నేను చాలా ఆశ్చర్యపోతున్నాను.. ఎవరు ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారు.. నిజంగా ఇలా అయితే బావుండు” అంటూ సున్నితంగా అవన్నీ ఫేక్ అని చెప్పుకొచ్చింది. ట్రోలర్స్ కు రష్మిక ఎప్పుడు తనదైన రీతిలో సమాధానమిస్తూనే ఉంటుంది. మొదట్లో ట్రోల్స్ కు భయపడినట్లు చెప్పుకొచ్చిన ఆమె ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదని తెలిపింది. ఇక ప్రస్తుతం రష్మిక పుష్ప 2 లో నటిస్తోంది.