Site icon NTV Telugu

Priyanka Mohan: రష్మిక కాదంటే ప్రియాంక ‘సై’ అన్నది!

Rashmika

Rashmika

Rashmika Mandanna out Priyanka Mohan in for Raviteja Movie: రవితేజ – గోపీచంద్ మలినేని ప్రాజెక్టు నుంచి రష్మిక మందన్న తప్పుకున్నట్టు తెలుస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మాస్ మహారాజాతో జతకట్టనుందని ఇంతకుముందు వార్తలు వచ్చాయి, అయితే డేట్స్ అందుబాటులో లేకపోవడంతో రవితేజ ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకున్నట్టు తెలుస్తోంది. హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్స్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని, రవితేజ మళ్లీ 4వ సినిమా కోసం చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం రేకు టీమ్ రష్మికను హీరోయిన్ పాత్ర పోషించడానికి సంప్రదించగా ముందు ఆమె అంగీకరించిందని, అయితే ఇప్పుడు డేట్స్ క్లాష్ కారణంగా, రష్మిక ఇప్పటికే పలు ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్నందున రవితేజ ప్రాజెక్ట్ నుండి నిష్క్రమించినట్లు తెలుస్తోంది.. ఈ క్రమంలోనే కృతి శెట్టి సహా మరికొందరు ఇతర హీరోయిన్లను టీమ్ సంప్రదించింది. ఇక ఈ క్రంమలోనే ప్రియాంక అరుల్ మోహన్ ను ఫైనల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

MP Vijayasai Reddy: చంద్రబాబు నాయుడు చరిత్ర ముగిసింది

నిర్మాతలు రష్మిక మందన్నను ఒప్పించేందుకు ప్రయత్నించారు, కానీ ఆమె తన కాల్ షీట్లను సర్దుబాటు చేయలేకపోయింది. అన్ని ఇతర అవకాశాలను పరిశీలించిన తర్వాత, చిత్రనిర్మాత గోపీచంద్ మలినేని ప్రియాంక మోహన్‌ను ఫిక్స్ అయ్యారు. ప్రియాంక మోహన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో “ఓజీ”, నానితో “సరిపోదా శనివారం” వంటి చిత్రాలలో నటిస్తోంది. ఈ ఏడాది రవితేజతో చేస్తున్న ప్రాజెక్ట్ ఆమెకు మూడో తెలుగు సినిమా అవుతుంది. మరోపక్క దేశంలోనే అత్యంత బిజీ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు కాగా ఆమె పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదిగింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్‌తో ‘యానిమల్’ డిసెంబర్‌లో విడుదల కానుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘రెయిన్‌బో’ అనే ఫిమేల్‌ ఓరియెంటెడ్‌ చిత్రంలో కూడా ఆమె నటిస్తోంది. ఆమె మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ ‘పుష్ప-2’లో కూడా నటిస్తోంది.

Exit mobile version