Site icon NTV Telugu

Rashmika: టాప్ ట్రెండింగ్ లో రష్మిక పేరు… కారణం ఆ మూడు

Rashmika

Rashmika

నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకోని కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా నిజంగానే నేషనల్ వైడ్ సినిమాలు చేస్తుంది రష్మిక. ఈ కన్నడ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో గత 24 గంటలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #rashmikamandanna అనే ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి మూడు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి దళపతి విజయ్ తో రష్మిక నటించిన ‘వారిసు’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈరోజు నుంచు స్ట్రీమ్ అవ్వడం. ఈ మూవీ 300 కోట్లు రాబట్టి విజయ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విజయ్ పక్కన మొదటిసారి నటించిన రష్మిక, వారిసు సినిమాలో డాన్స్ తో ఆకట్టుకుంది. రెండో రీజన్, రష్మిక ఫోటోషూట్. నార్త్ లో అవకాశాలు వస్తుండడంతో అక్కడి మార్కెట్ కి తగ్గట్లు గ్లామర్ షో చేస్తూ ఫోటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది రష్మిక. గత కొంతకాలంగా రష్మిక చేస్తున్న ఫోటోషూట్స్ అన్నీ ఇలాంటివే.

తాజాగా రష్మిక ట్విట్టర్ లో మరోసారి ఫోటోషూట్ కి సంబంధించిన వీడియో ఒకటి రిలీజ్ చేసింది. ఇందులో రష్మిక చాలా హాట్ గా కనిపించడంతో, యూత్ స్క్రీన్ షాట్స్ తీసుకోని మరీ రష్మిక ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ హాట్ ఫోటోస్ ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక రష్మిక పేరు వైరల్ అవ్వడానికి మూడో కారణం, పుష్ప 2 సెట్స్ లో రష్మిక జాయిన్ అవ్వడమే. పుష్ప ది రైజ్ తోపాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక, తాజాగా పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. రష్మిక 10 రోజులు ఈ షెడ్యూల్ కోసం కేటాయించిందని సమాచారం. ఈ షెడ్యూల్ లో రష్మిక, అల్లు అర్జున్ ల మధ్య సీన్స్ ని సుకుమార్ షూట్ చేస్తున్నాడట. అయితే ఓవరాల్ గా పుష్ప 2లో రష్మిక ఎక్కువ సేపు కనిపించదు అనే టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకూ నిజముందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Exit mobile version