Rashmika: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రష్మిక మందన్నా.. ప్రస్తుతం వివాదంలో చిక్కున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ కన్నడ బ్యూటీ కన్నడిగులకు ఆగ్రహం తెప్పిస్తున్న విషయం తెల్సిందే. కర్ణాటక లో పుట్టి, కన్నడలో మొదటి హిట్ అందుకొని ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీని అమ్మడు లైట్ తీసుకుందని వారు విమర్శిస్తున్నారు. ఇక ఇందుకు ఆజ్యం పోసింది కాంతార మూవీ. దేశం మొత్తం సంచలనం సృష్టించిన ఈ సినిమాను కన్నడ హీరోయిన్ అయ్యి ఉండి కూడా ఇప్పటివరకు చూడలేదని, ఆ విషయాన్నీ నిర్మొహమాటంగా మీడియా ముందు చెప్పి యాటిట్యూడ్ చూపించిందని ట్రోల్స్ చేస్తున్న సంగతి తెల్సిందే.
ఇక ఇంకోపక్క రిషబ్ శెట్టి సైతం ఇన్ డైరెక్ట్ గా రష్మికపై కామెంట్స్ చేయడంతో ఇంకా ఈ వివాదం ముదిరింది. దీంతో కన్నడ ఇండస్ట్రీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నదని తెలుస్తోంది. ఇక నుంచి రష్మిక సినిమాలను కర్ణాటకలో ఆడకుండా ఆమెను బ్యాన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు కానీ, కన్నడిగులు మాత్రం అమ్మడిపై కోపంతో రగిలిపోతున్నారన్న మాట వాస్తవమని చెప్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
