NTV Telugu Site icon

Rashmika: రష్మిక ఏంటి ఇలా అనేసింది?

February 7 (38)

February 7 (38)

నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కన్నడ భామ అనతి కాలంలోనే టాలీవుడ్ లో వరుస విషయాలను అందుకుని స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ క్రమంలో అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారింది. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇక ఇటీవల బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టిన రష్మిక ప్రజంట్ ‘చావా’ మూవీ లో బిజీగా ఉంది. విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్నా ఈ సినిమా ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా పాల్గొంటుంది ఈ చిన్నది.ఇదిలా ఉంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక మందన్న తాజాగా పెట్టిన పోస్ట్‌ ఇకటి వైరల్‌గా మారింది.

Also Read: Allu Aravind: సాయి పల్లవిని తీసుకోవడానికి కారణం ఇదే..

‘ఈ రోజుల్లో అందరిలో దయ గుణం తగ్గుతుంది. నేను ఇతరుల పట్ల చాలా దయతోనే ఉండాలనుకుంటాను. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దయ నే ఎంచుకునేందుకు ప్రయత్నిస్తుంటా. మనమందరం ఒకరికొకరం దయతో ఉందాం’ అంటూ తన ట్విట్టర్ లో రాసుకొచ్చింది. అలాగే ‘KINDFUL’ అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించింది ఈ బ్యూటీ. నటి రష్మిక చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసింది అని అంతా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతుంది అని ఆలోచన పడ్డారు. తనకు ఎమైన ఇలాంటి సంఘటన ఎదురైందా? అందుకే ఇలా మాట్లాడుతుందా? అని సందేహంలో వరుస కామెంట్‌లు చేస్తున్నారు.