Site icon NTV Telugu

Rashmika: పెళ్ళిలో ఆ పని చేసిన అసిస్టెంట్.. ఏడ్చేసిన రష్మిక.. వీడియో వైరల్

Rashmika

Rashmika

Rashmika: సాధారణంగా సెలబ్రిటీలు అంటే కొంతవరకు ఆటిట్యూడ్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కింద పనిచేస్తున్న వారి పెళ్లిళ్లకు, వారి ఫంక్షన్లకు వెళ్తే ఎక్కడ చీప్ గా చూస్తారో.. అలాంటివారి ఫంక్షన్స్ కు మేమెందుకు వెళ్ళాలి అని చాలామంది వెళ్లరు. కానీ, మరికొంతమంది సెలబ్రిటీలు మాత్రం తమ దగ్గర పనిచేసే వారిని తమ కుటుంబ సభ్యులుగా ట్రీట్ చేస్తూ ఉంటారు అందులో అల్లు అర్జున్ ముందుంటాడు ఇప్పటికే ఆయన దగ్గర పనిచేసిన చాలామంది అసిస్టెంట్స్ పెళ్ళికి వెళ్లి వారిని ఆనందపరిచాడు ఇక అల్లు అర్జున్ బాటలోనే నేషనల్ క్రష్ రష్మిక నడుస్తుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అంతలా రష్మిక ఏం చేసింది అంటే.. నిన్న హైదరాబాద్లో రష్మిక అసిస్టెంట్ సాయి పెళ్లి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆరెంజ్ కలర్ చీరలో ఏంటో సింపుల్ గా రష్మిక ఈ పెళ్ళికి హాజరయ్యింది.

Rana Daggubati: జై భీమ్ వివాదం.. వారు కాంట్రవర్సీ చేశారు.. రానా సెన్సేషనల్ కామెంట్స్

ఇక తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోలో రష్మిక పెళ్లికి రావడంతో పాటు నూతన వధూవరులను ఆశీర్వదించడం కనిపిస్తుంది. అందులో భాగంగానే నూతనవధూవరులు.. రష్మిక కాళ్లకు మొక్కడంతో ఆమె వద్దు.. వద్దు అంటూ వాళ్ళని పైకి లేపుతూ ఏడ్చేసింది. ఇలాంటి పనులు చేయొద్దు.. నేను చిన్నదాన్ని అంటూ వారిని పైకి లేపి ఎమోషనల్ అయ్యింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు మా నేషనల్ ఫ్రెష్ బంగారం రా.. అసిస్టెంట్ పెళ్లికి అన్ని పనులు మానుకొని ఎవరు వెళ్తారు..? అందుకే రష్మిక అంటే మాకు ఇష్టం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే రష్మిక చేతిలో దాదాపు నాలుగు సినిమాలు ఉన్నాయి. అన్ని పానీ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఇప్పటికే పుష్ప 2 షూటింగ్ జరుపుకుంటుండగా యానిమల్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ రెండు కాకుండా ధనుష్ 51, రెయిన్బో లో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ సినిమాలు అమ్మడికి ఎలాంటి విజయాలను అందిస్తాయో చూడాలి.

Exit mobile version