NTV Telugu Site icon

Rashmika Mandanna: బిగ్ బ్రేకింగ్.. అరుదైన గౌరవం అందుకున్న రష్మిక

Rash

Rash

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆమె చేతినిండా పాన్ ఇండియా సినిమాలే ఉన్నాయి. ఇప్పటికే బాలీవుడ్ చిత్రం యానిమల్ సినిమాను పూర్తి చేసిన రష్మిక ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఇక ఈ రెండు కాకుండా రెయిన్ బో, D51 సినిమాల్లో రష్మిక నటిస్తుంది. మొదటి నుంచి రష్మిక తన అందం, అభినయంతో అభిమానుల్ని ఫిదా చేస్తూ వచ్చింది. నేషనల్ క్రష్ అని బిరుదును అభిమానులు ఆమెకు అందజేశారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల వల్ల ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇక తాజాగా రష్మిక ఒక అరుదైన గౌరవాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఏ సౌత్ హీరోయిన్ ఇలాంటి గౌరవాన్ని అందుకున్నది లేదు.

Abhishek Pictures: ఎవడు కొనమన్నాడురా సినిమా.. ఎవరు ఇవ్వాలి డబ్బులు.. ఏకిపారేస్తున్న రౌడీ ఫ్యాన్స్

అదేంటంటే బెస్ట్ ఏషియన్ యాక్ట్రెస్ అవార్డుకు రష్మిక నామినేట్ అయింది. ఫేమస్ సెప్టిమియస్ అవార్డ్స్ 2023.. కొద్దిసేపటి క్రితమే నామినేషన్స్ ను ప్రకటించారు. అందులో బెస్ట్ ఏసియన్ యాక్ట్రెస్ విభాగంలో రష్మిక పేరు నామినీగా ఉండడం విశేషం. ఇక బెస్ట్ ఏషియన్ యాక్టర్ విభాగంలో మలయాళ నటుడు టోవినో థామస్ నిలిచాడు. నెదర్లాండ్స్ లోని ఆంస్టర్డమ్ ఈ అవార్డు ఫంక్షన్ జరుగునుంది. ఇక ఈ విషయం తెలియడంతో రష్మిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అభిమానులు ఆమెకు ఈ విషయాన్నీ తెలుపగా.. వారికి థాంక్స్ చెప్తూ ట్వీట్ చేసింది. “ఎంత అద్భుతమైన సర్ప్రైజ్ ఇది. థాంక్యూ ఇదంతా కేవలం మీ ప్రేమ వలనే దక్కింది. మీ అందరికీ నేనెప్పుడూ ఋణపడి ఉంటాను” చెప్పుకొచ్చింది ప్రస్తుతం ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Show comments