Site icon NTV Telugu

Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్ రెగ్యులర్ షూటింగ్ షురూ…

Rashmika Mandanna

Rashmika Mandanna

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.

Read Also: Kalyan Ram: డైనోసర్ ముందుకి డెవిల్?

“ది గర్ల్ ఫ్రెండ్” సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా హైదరాబాద్ లో ప్రారంభమైంది. సెట్ లోకి లో అడుగుపెట్టిన హీరోయిన్ రశ్మికకు దర్శకుడు రాహుల్ రవీంద్రన్, నిర్మాతలు ఎస్ కేఎన్, దీరజ్ మొగలినినేని, విద్య కొప్పినేని
వెల్ కమ్ చెప్పారు. రశ్మిక, సినిమా టీమ్ కు అల్లు అరవింద్ తన బ్లెస్సింగ్స్ అందజేశారు. 20 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో రశ్మికతో పాటు కీలక నటీనటులు పాల్గొంటారు. రశ్మిక మందన్న లీడ్ రోల్ లో నటిస్తున్న వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రమిది. ఒక సూపర్ హిట్ సినిమాకు పనిచేస్తున్న పాజిటివ్ ఫీలింగ్, కాన్ఫిడెన్స్ తో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించింది “ది గర్ల్ ఫ్రెండ్” మూవీ టీమ్.

Read Also: Salaar Vs Dunki: 24 గంటల్లో సలార్ ట్రైలర్ రికార్డ్స్ ని డంకీ ట్రైలర్ బీట్ చేయలేకపోయింది

Exit mobile version