Site icon NTV Telugu

అల్లు అర్జున్ కు సర్ప్రైజ్… స్టార్ హీరోయిన్ స్పెషల్ గిఫ్ట్

Allu-arjun

Allu arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఓ స్టార్ హీరోయిన్ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపింది. ఈ విషయాన్నీ బన్నీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం విశేషం. ప్రస్తుతం అల్లు అర్జున్ తన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప: ది రైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు బన్నీకి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన స్టార్ హీరోయిన్ కూడా రష్మికే.

Read Also : తగ్గేదే లే… అనుకున్న టైమ్ కే ‘పుష్ప’ హిందీ వెర్షన్ రిలీజ్

తాజాగా స్టైలిష్ స్టార్ ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని పోస్ట్ చేసారు. అందులో తనకు ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపినందుకు రశ్మికకు ధన్యవాదాలు తెలిపాడు. సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లో రష్మిక ఒక ప్రత్యేక నోట్ కూడా పంపింది. అందులో “మీకు ఏదైనా స్పెషల్ గా పంపాలని అనిపించింది సర్. పుష్ప కోసం మనకు ఆల్ ది బెస్ట్… లవ్, రష్మిక” అని ఉంది. ఈ సర్ప్రైజ్ కు ను సోషల్ మీడియాలో షేర్ చేసిన అల్లు అర్జున్ రష్మికకు కృతజ్ఞతలు తెలిపాడు. “పుష్ప ది రైజ్” డిసెంబర్ 17న తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో విడుదల కానుంది.

Exit mobile version