Site icon NTV Telugu

రష్మిక అండర్ వేర్ ప్రకటనపై విమర్శలు

రష్మిక మందన్న మనకున్న క్రేజీ హీరోయిన్స్ లో ఒకరు. తెలుగులోనే కాదు తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తూ దేశంలో బిజీగా ఉండే కథానాయికలలో ఒకరుగా ఉన్నారామె. సినిమాలే కాదు వివిధ రకాల బ్రాండ్ లకు అంబాసిడర్ గా కూడా వ్యవహిరిస్తోంది. తాజాగా రష్మిక పురుషుల అండర్‌గార్నమెంట్ బ్రాండ్ మాకో ప్రకటనలో మెరిచింది. ఈ ప్రకటనలో ఆమె విక్కీ కౌశల్‌తో కలిసి నటించింది. ఈ యాడ్‌లో రష్మిక విక్కీ కౌశల్ అండర్ వేర్ పట్టీని చూస్తూ ఉండటం గమనించవచ్చు. దీంతో ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రకటన స్టాండర్డ్ తక్కువగా ఉండి సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తుందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

‘రష్మిక మీ నుండి ఈ చౌకబారు ప్రకటన ఊహించలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా… ‘ఈ రోజుల్లో లో-దుస్తుల ప్రకటనల ద్వారా ఏం జరుగుతోంది. ఇంతకు ముందు అర్థం పర్ధం లేని ‘లక్స్ కోజీ’ ప్రకటన… ఇప్పుడు మాచో యాడ్… అసలు ఈ అండర్ వేర్, డియోడరెంట్ కంపెనీల ప్రచార బృందం ఈ ప్రకటనలతో ఏం చెప్పాలనుకుంటున్నారు’ అని మరొక వినియోగదారుడు సోషల్ మీడియాలో ఏకి పడేశారు. అయితే సోషల్ మీడియాలో ఎదురవుతున్న ఈ విమర్శలకు ప్రకటనదారులు కానీ ఏజెన్సీలు కానీ స్పందించటంలేదు. అయితే విక్కీ కౌశల్‌తో రష్మిక నటించటంపై అభిమానులు సంతోషంగా ఉన్నారు. వీరి కలయికలో సినిమా కూడా రావాలని కోరుకుంటున్నారు.

Exit mobile version