శర్వానంద్ చాలా కాలం తర్వాత ఫ్యామిలీ డ్రామా “ఆడవాళ్లు మీకు జోహార్లు”తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధాకర్ నిర్మించారు. రష్మిక మందన్న ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. ఆదివారం “ఆడవాళ్లు మీకు జోహార్లు” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో శర్వానంద్ పై రష్మిక ఆసక్తికర కామెంట్స్ చేసింది. “నేను శర్వానంద్‌ని ఎంత ఇరిటేట్ చేసినా ఆయన ఎప్పుడూ చిరాకు పడడు. నేను ఇప్పటి వరకూ కలుసుకున్న స్వీటెస్ట్ బాయ్స్ లో ఒకడు శర్వా. నేను సెట్స్‌లో ఎంత ఇరిటేట్ చేసినా శర్వా భరిస్తాడు. నెక్స్ట్ ఫిల్మ్ లో ఇంకా ఎక్కువ చిరాకు తెప్పిస్తా… రెడీగా ఉండు” అంటూ శర్వానంద్ కు చెప్పేసింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు నటి మొత్తం తారాగణం, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపింది. మార్చి 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Read Also : Sukumar : ఫేవరెట్ హీరో, హీరోయిన్ రివీల్… గ్యాంగ్ లీడర్ మాత్రం మిస్ అయ్యిందట !
