NTV Telugu Site icon

Rashmika: నేషనల్ క్రష్ ఫేవరేట్ ‘క్రికేటర్ & IPL’ టీమ్ ఇదే!

Rashmika

Rashmika

ప్రస్తుతం సోషల్ మీడియా విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్ వార్ ఆఫ్ వర్డ్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. లక్నో సూపర్ జైంట్స్ vs ఆర్సీబీ మధ్య హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లి-గంభీర్ ల మధ్య జరిగిన వాగ్వివాదం వరల్డ్ వైడ్ ట్రెండింగ్ టాపిక్ గా మారింది. 2013 నుంచి గంభీర్ అండ్ కోహ్లిల మధ్య ఆన్ ఫీల్డ్ రైవల్రీ ఉంది కాకపోతే అప్పుడు గంభీర్ ప్లేయర్ ఇప్పుడు మెంటర్ స్థానంలో ఉన్నాడు అంతే. ఇప్పుడు సోషల్ మీడియాలో మోస్ట్ డిస్కస్డ్ టాపిక్ గా ఉన్న ఈ విషయం గురించి అందరూ స్పందిస్తున్నారు. ఇక ఇదే సమయంలో రష్మిక మందన్న తన ఫేవరేట్ క్రికేటర్ అండ్ ఐపీఎల్ టీమ్ గురించి చెప్పిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇప్పటికే.. ఈసారి ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్‌లో రష్మిక మందన పుష్ప, ఆర్ఆర్ఆర్ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేసి దుమ్ములేపింది. తాజాగా ‘స్టార్ స్పోర్ట్స్’ ఛానల్‌కి ఇంటర్వ్యూలో.. రష్మిక తనకు ఇష్టమైన క్రికెట్ జట్టుతో పాటు క్రికెటర్ గురించి చెప్పుకొచ్చింది.

ఒక బెంగళూరు అమ్మాయిగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తన ఫేవరేట్ అని, ఈ సాలా కప్ నమ్దే అంటూ స్లోగన్‌ కూడా చెప్పింది. ఖచ్చితంగా ఈసారి ‘ఆర్సిబి’ ఫైనల్‌కి వెళ్తుందని చెప్పుకొచ్చింది. ఇక తన ఫేవరేట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సర్ అని రష్మిక చెప్పింది. కోహ్లీ దూకుడు, బ్యాటింగ్ శైలి తనకిష్టమని చెప్పుకొచ్చింది. #RCB #ViratKohli #PlayBold టాగ్స్ తో పాటు $Rashmika ట్యాగ్ కూడా నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. ఇకపోతే.. ప్రస్తుతం రష్మిక పుష్ప2, యానిమల్ వంటి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. అలాగే నితిన్‌ సరసన ఓ సినిమా, రెయిన్‌బో అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా చేస్తోంది. ఏదేమైనా.. సినిమాలతో పాటు ఐపీఎల్‌తోనూ సోషల్ మీడియాలో రష్మిక సందడి చేస్తుంది.

Show comments