Rashmika Mandanna Reacts On Affair Rumours: ‘గీత గోవిందం’లో విజయ్ దేవరకొండ, రశ్మికా మందణ్ణ జోడీ కట్టినప్పటి నుంచి.. ఆ ఇద్దరిపై ఎఫైర్ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ ఇద్దరు కలిసి కెమెరాకి చిక్కితే చాలు.. డేటింగ్ వార్తలు ఒక్కసారిగా గుప్పుమంటాయి. తాము కేవలం మంచి స్నేహితులమేనని ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా.. మీడియా మాత్రం ‘లేదు మీరు ప్రేమలో ఉన్నారు’ అంటూ ప్రచారం చేస్తూనే ఉంది. ఇక రీసెంట్‌గా రశ్మికాను విజయ్ తన డార్లింగ్ అని చెప్పినప్పటి నుంచి ఈ రూమర్లు మరింత జోరుగా చక్కర్లు కొట్టడం మొదలయ్యాయి. పబ్లిక్‌గానే డార్లింగ్ అని చెప్పాడు కాబట్టి, తమ ప్రేమను విజయ్ ఖరారు చేసేశాడని అంతా ఫిక్సైపోయారు. ఇక రశ్మికా ఒక్కటే క్లారిటీ ఇస్తే సరిపోతుందని, ఆమె రియాక్షన్ కోసం వేచి చూస్తూ ఉన్నారు.
ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చేసింది. బాలీవుడ్ మీడియా చేతికి చిక్కడంతో.. ఎఫైర్ రూమర్స్‌పై ప్రశ్నలు సంధించింది. అయితే.. ఈసారి రశ్మికా రొటీన్‌కి భిన్నంగా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ‘‘ఎప్పుడూ ఇదే ప్రశ్న అడుగుతుండటం చూసి, కొన్నిసార్లు నాకు చిరాకొచ్చింది. ‘అరే యార్, నేను ఏడాదికి ఐదు సినిమాలు చేస్తున్నా. అయినా వాటి గురించి కాకుండా ఎవరితో ఎఫైర్‌లో ఉన్నావ్, మీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? అనే ప్రశ్నలే అడుగుతారా’ అంటూ చిర్రెత్తుకొస్తుంది. అవును, సెలెబ్రిటీలపై ఎఫైర్ వార్తలు రావడం సహజమే! కానీ, నా కెరీర్ ప్రారంభం నుంచి నాకు అవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నేను ఇప్పుడు ఒక్కటే చెప్పదలచుకున్నా. స్వయంగా నాకు నేను చెప్పేదాకా.. ఎవ్వరూ నా వ్యక్తిగత జీవితంపై కన్‌క్లూజన్‌కి రావొద్దు’’ అంటూ రశ్మికా చెప్పుకొచ్చింది.
సినిమాల గురించి అడిగితే, తాను ప్రతీదానికి సమాధానం చెప్పగలనని.. కానీ వ్యక్తిగత జీవితం గురించి అలా స్పందించలేదనని రశ్మికా తెలిపింది. ‘‘అలాగని నా వ్యక్తిగత జీవితంపై ఎవ్వరూ నోరు మెదపకూడదని నేను అనడం లేదు. నేనైతే.. ఆ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చేదాకా మాట్లాడలేను’’ అని ఈ కన్నడ బ్యూటీ పేర్కొంది. కాగా.. ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్ పలు హిందీ సినిమాలతో పాటు తెలుగు, తమిళ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది.
