సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న అందమైన నటి రష్మిక మందన్న త్వరలో బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతోంది. “భీష్మ” హీరోయిన్ ను ఇప్పటికే ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తున్నారు అభిమానులు. ఆమె తొలి చిత్రం “మిషన్ మజ్ను” విడుదలకు ముందే మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో “గుడ్‌బై” అనే మరో హిందీ చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసేసింది. సోషల్ మీడియాలో తరచూ ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ యాక్టివ్ గా ఉండే రష్మిక నిర్ణయంతో తాజాగా ఆమె పేరెంట్స్ అప్సెట్ అయ్యారట.
Read Also : బాలకృష్ణ చేతుల మీదుగా “నాట్యం” ఫస్ట్ సింగిల్
రష్మిక మందన్న మాట్లాడుతూ “నా తల్లిదండ్రులు నేను బ్యాక్ టు బ్యాక్ షూట్ లకు వెళ్లడం గురించి బాధపడుతున్నారు. కోవిడ్ -19 ఇంకా ఉన్నందున ప్రాజెక్టుల షూట్‌లను కొన్ని రోజులు వాయిదా వేయమని వారు నాకు చెప్పారు. నాపై వారికున్న ప్రేమ నన్ను కలచి వేసింది. కానీ షూటింగ్‌లను వాయిదా వేసే నిర్ణయం నా చేతుల్లో లేదు. నేను షూటింగులలో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడానికి అదే ప్రధాన కారణం. నేను అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌లలో పాల్గొంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.
