NTV Telugu Site icon

Rashmika Mandanna: నన్ను ప్రేక్షకులు అలా చూడడానికి ఒప్పుకోరు అని చెప్పా.. అయినా

Rashmika

Rashmika

Rashmika Mandanna:నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. తెలుగు, హిందీ భాషల్లో తీరిక లేకుండా నటిస్తున్న రష్మిక సీతారామం చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ నేడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోగా.. రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గానే చేస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమా మొత్తం ఆమె దగ్గర ఉండి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ముస్లిమ్ యువతి అఫ్రీన్ గా సీతారామ్ లను కలిపే ఒక పెద్ద బాధ్యతను భుజాన వేసుకొని వారిని వెతికే క్రమంలో ఆమెకు ఎదురైనా సవాళ్ళే ఈ సినిమాగా తెలుస్తోంది. ఇక అఫ్రీన్ గా రష్మిక జీవించేసింది. అయితే ఈ పాత్ర ఒప్పుకున్నప్పుడు చాలా భయమేసింది రష్మిక చెప్పుకొచ్చింది.

నేడు జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రష్మిక మాట్లాడుతూ ” మొదట ఈ పాత్ర చేయడానికి నేను భయపడ్డాను. ఇప్పటివరకు చాలా పత్రాలు చేశాను. బబ్లీగా కనిపించాను, యాంగ్రీ బర్డ్ గా చేశాను. అయితే అఫ్రీన్ పాత్ర రెబెల్ గా ఉంటుంది.. చాలా వయోలెంట్ గా కనిపిస్తుంది. దీంతో నా క్యారెక్టర్ విన్నప్పుడే.. వద్దండీ ప్రేక్షకుల నన్ను అలా చూడడానికి ఒప్పుకోరు అని చెప్పాను. అయినా హను కథ మొత్తం చెప్పి పర్లేదు బావుంటుంది అని ధైర్యం చెప్పారు. దీంతో ఆ పాత్రపై కొంత హార్డ్ వర్క్ చేసి ఫైనల్ గా చేయడానికి ఒప్పుకున్నాను. సినిమాలో నా పాత్ర ప్రతి ఒక్కరికి నచ్చుతోంది. ఆగస్టు 5 న ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధిస్తుందని నేను నమ్ముతున్నాను” అని చెప్పుకొచ్చింది.