Site icon NTV Telugu

Rashmika Mandanna: సౌందర్య బయోపిక్ లో రష్మిక.. ఎందుకురా.. లేనిపోనివి పెడతారు.. ?

Soundarya

Soundarya

Rashmika Mandanna: అందం, అభినయం కలగలిపిన రూపం ఆమె సొంతం. గ్లామర్ ఒలకబోయడం ఆమెకు తెలియదు అని చెప్పలేం. చీరలో కూడా అందాలను చూపించొచ్చు అన్నది ఆమె దగ్గరనే నేర్చుకోవాలి. సినిమా ఏదైనా.. పాత్ర ఎలాంటిదైనా ఆమె దిగనంత వరకే. ఒక్కసారి ఆమె రంగంలోకి దిగిందా అవార్డులు అలా నడుచుకుంటూ వస్తాయి. కానీ, దేవుడు మంచివాళ్లను త్వరగా తీసుకెళ్ళిపోతాడు అన్నట్లు.. ఆమెను కూడా అతి చిన్న వయస్సులోనే తనదగ్గరకు రప్పించుకున్నాడు. అయితే ఏం.. ఆమె నటించిన సినిమాలతో నిత్యం ప్రేక్షకుల మనస్సులో జీవించే ఉంటుంది. ఆమె ఎవరో కాదు.. అందాల బొమ్మ సౌందర్య. పేరుకు తగ్గట్టు సౌందర్య రాశీ. అణుకువ, వ్యక్తిత్వంతో మరింత పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన సౌందర్య.. 2004 ఏప్రిల్ 17 న ఒక విమాన ప్రమాదంలో మృతి చెందింది. అప్పటి నుంచి సౌందర్య బయోపిక్ తీయాలని ఎంతోమంది ఫిల్మ్ మేకర్స్ అనుకున్నారు కానీ, అది కార్యరూపం దాల్చలేదు.

మహానటి సినిమా తరువాత హీరోయిన్ల బయోపిక్స్ కు డిమాండ్ పెరిగింది. సౌందర్య జీవితంలో ఏం జరిగింది అని తెలుసుకోవాలని అభిమానులు ఎంతో ఆసక్తి కనపరుస్తున్నారు. ఇక గత కొన్నిరోజులుగా సౌందర్య బయోపిక్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అక్కడవరకు ఓకే.. కానీ, కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి.. సౌందర్యగా రష్మిక కనిపించనుందని మరో వార్తను సృష్టించారు. రష్మిక, సౌందర్యలా ఉంటుందని, ఆమె అయితేనే ఈ పాత్రకు న్యాయం చేస్తుందని చెప్పుకొస్తున్నారు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో రష్మిక సైతం సౌందర్య బయోపిక్ తీస్తే అందులో నటించాలని ఉందని చెప్పడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. ఈ వార్త విన్న సౌందర్య అభిమానులు సౌందర్య బయోపిక్ లో రష్మిక.. ఎందుకురా.. లేనిపోనివి పెడతారు.. ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ బయోపిక్ ఉంటుందా.. ? లేదా.. ? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Exit mobile version