Site icon NTV Telugu

నెక్స్ట్ మూవీకి రష్మిక గ్రీన్ సిగ్నల్

Sivakarthikeyan to romance Rashmika Mandanna

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తెలుగు టాప్ హీరోయిన్లలో ఒకరు. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలతో ప్రస్తుతం బిజీగా ఉంది ఈ కన్నడ సోయగం. ఆమె తెలుగు లో ఇప్పుడు ఆమె నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప” షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఇక రష్మిక మందన్న తన తరువాత చిత్రానికి సంతకం చేసినట్లు తాజా వార్తలు చెబుతున్నాయి.

Read Also : కెప్టెన్ గా తడబడుతున్న జెస్సీ|

హను రాఘవపూడి తదుపరి చిత్రంలో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మెయిన్ హీరోయిన్. హైదరాబాద్, కాశ్మీర్‌లో ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. రష్మికకు ఒక ప్రముఖ పాత్ర కేటాయించారు. ఇటీవల రష్మిక ఈ ప్రాజెక్ట్ పై సంతకం చేసింది. ఇందులో ఆమె అతిథి పాత్రలో కనిపించబోతోంది. ఈ పాన్-ఇండియన్ సినిమా తదుపరి షెడ్యూల్ రష్యాలో జరుగుతుంది. ఇక పేరు ఖరారు చేయని ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ “లెఫ్టినెంట్‌”గా నటిస్తున్నారు. స్వప్న సినిమా నిర్మాతలు సినిమా వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.

Exit mobile version