Rashmika Mandanna Gives Clarity On NTR30 Movie Rumours: కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో.. NTR30లో రష్మిక మందణ్ణ కథానాయికగా నటించనుందన్న తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ, దాదాపు ఆ అమ్మడు కన్ఫమ్ అయినట్టు వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే రష్మిక తారసపడటంతో.. మీడియా నేరుగా ఆమెని ఈ వార్తలు నిజమేనా? అని ప్రశ్నించింది. అందుకు రష్మిక కొంచెం గందరగోళమైన సమాధానమే ఇచ్చింది. ‘‘ఇంకా అఫీషియల్‌గా ప్రకటించనే లేదు.. మీకెలా తెలిసింది? మీరే కన్ఫమ్ చేసేశారా?’’ అంటూ ఓ విలేఖరికి బదులిచ్చింది. ‘‘సోషల్ మీడియాలో మీరు కన్ఫమ్ అయినట్టు వార్తలొస్తున్నాయి కదా!’’ అని మళ్లీ ఆ విలేకరి ప్రశ్నిస్తే.. ‘‘మీరే కన్ఫమ్ చేసి ఉంటారు’’ అంటూ రష్మిక బదులిచ్చింది. దీన్ని బట్టి.. NTR30లో రష్మిక దాదాపు కన్ఫమ్ అయినట్టేనని స్పష్టమవుతోంది.
సాధారణంగా ఇలాంటి రూమర్లు వచ్చినప్పుడు.. ఏ నటి అయినా అవునా? కాదా? అనేది సూటిగా చెప్పేస్తుంది. ఎంపిక కాకపోయి ఉంటే.. తనని ఎవరూ సంప్రదించలేదని, అవన్నీ ఫేక్ వార్తలని తేల్చి చెప్పేస్తారు. ఒకవేళ సెలెక్ట్ అయ్యుంటే.. సూటిగా చెప్పేయడమో లేక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేదాకా రెస్పాండ్ అవ్వకుండా ఉండడమో చేస్తారు. ఇక్కడ రష్మిక మాత్రం ఆ రెండూ చేయకుండా.. ‘‘ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు కదా’’ అని చెప్పింది. అంటే, ఎన్టీఆర్‌తో జోడీ కట్టబోతుండడం నిజమేనని పరోక్షంగా హింట్ ఇచ్చేసింది. మొత్తానికి.. చాలాకాలం నిరీక్షణ తర్వాత, NTR30 సినిమాకు హీరోయిన్ కష్టాలకు చెక్ పడిందన్నమాట! ఇకపోతే.. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రూపొందుతోంది కాబట్టి.. ఈ NTR30 సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకి అందుకునేలా, సబ్జెక్ట్‌కి పాన్ ఇండియా లెవెల్‌లో కొరటాల తగిన మార్పులు, చేర్పులు చేస్తున్నాడు. అందుకే, పట్టాలెక్కడానికి ఆలస్యమవుతోంది.
