నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు ఇండియన్ సినిమాలో మోస్ట్ వాంటెడ్ నేమ్ గా మారింది. కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ సినిమా రంగ ప్రవేశం చేసిన ఈ హీరోయిన్, మొదటి సినిమాతోనే భారీ విజయం అందుకుంది. ఛలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్న. ఆ సినిమా విజయం సాధించడంతో తెలుగులో ఆమెకు భారీ అవకాశాలు వచ్చాయి. దేవదాస్, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప చిత్రాలతో రష్మిక మందన్న తనకంటూ స్పెషల్ క్రేజ్ ని యూత్ లో సొంతం చేసుకుంది.
Read Also: Rashmika: శ్రీవల్లీ.. ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నావా.. అంత తెల్లగా అయినావ్
ఇక పుష్ప ది రైజ్ సినిమాలో చేసిన ‘శ్రీవల్లి’ పాత్ర రష్మికకి హ్యూజ్ అప్లాజ్ తెచ్చి పెట్టింది. ఈ మూవీ తర్వాత రష్మిక స్ట్రెయిట్ హిందీ సినిమాలు కూడా చేసేస్తోంది. తమిళ్ లో మొదటి సినిమాకే దళపతి విజయ్ తోనే నటించే ఛాన్స్ కొట్టేసింది అంటే రష్మిక క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న యానిమల్ సినిమాలో తన పోర్షన్‌ను కంప్లీట్ చేసుకోని పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. పుష్ప ది రైజ్ సినిమా తర్వాత చాలా బ్రాండ్స్ తో కోలాబ్ అయిన నేషనల్ క్రష్, ఇండియాలోని జపనీస్ దుస్తుల బ్రాండ్ ‘ఒనిట్సుకా టైగర్’కి ఫేస్ అయ్యింది.
ఈ బ్రాండ్ ప్రచారం కోసం రష్మిక, జపాన్ అమ్మాయిగా మారిపోయింది. ఇన్స్టాగ్రామ్ లో రష్మిక ఈ లేటెస్ట్ బ్రాండ్ కోలాబ్ కోసం చేసిన ఫోటోషూట్ పిక్స్ ని షేర్ చేసింది. ఈ ఫోటోస్ లో హెయిర్ స్టైల్ నుంచి డ్రెస్సింగ్ వరకూ అన్నింటిలో రష్మిక జపాన్ అమ్మాయిలాగే కనిపిస్తోంది. జపాన్, కొరియన్ వెబ్ సీరీస్ ల్లో చూసే హీరోయిన్స్ లా కనిపిస్తున్న రష్మికని ఇండియాలోని ఫాన్స్ ఎంత వరకూ యాక్సెప్ట్ చేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే రష్మిక నార్మల్ గా తెలియక ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తేనే సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ ఒక రేంజులో వస్తాయి. అలాంటిది బ్రాండ్ కోసం ఇలా లుక్ మార్చేసి, రంగు రంగు బట్టలో ఉన్న ఫోటోలని పోస్ట్ చేస్తే కామెంట్స్ చెయ్యకుండా ఉంటారా? ఆ కామెంట్స్ మాములే, రష్మిక వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకోని పోవడం కూడా మాములే.
