Site icon NTV Telugu

Rashmika : మరో హారర్‌ చిత్రంలో రష్మిక?

Shah Rukh Khan Injury (1)

Shah Rukh Khan Injury (1)

టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్నా ఇప్పుడు వరుస ప్రాజెక్ట్‌లతో ధూసుకుపోతుంది. ఇటీవల కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, ఈ దీపావళికి థామా అనే హారర్ లవ్‌స్టోరీతో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రష్మిక పేరు మరో హారర్‌ ప్రాజెక్ట్‌తోనూ బలంగా వినిపిస్తోంది.

Also Read : Danush : ధనుష్‌ – కలాం బయోపిక్‌పై ఓం రౌత్ వ్యాఖ్యలు

ప్రేక్షకులను హారర్ కామెడీ జానర్‌లో, అలరించిన ‘కాంచన’ ఫ్రాంఛైజీకి కొత్త ఎడిషన్‌గా వస్తున్న కాంచన 4 కోసం, రాఘవ లారెన్స్ ప్రత్యేకంగా రష్మికను సంప్రదించినట్లు కోలీవుడ్ టాక్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా, పూజా హెగ్డే, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కానీ సినిమాలోని ఓ ప్రత్యేకమైన రోల్ కోసం రష్మికను తీసుకుంటే, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరగడం ఖాయం. ఒకవేళ రష్మిక కాంచన 4లో భాగమైతే, ఇది ఆమె కెరీర్‌లో మరో కొత్త మలుపు అవుతుంది. హారర్ సినిమాలంటే ప్రత్యేకమైన మార్కెట్ ఉండడం, అలాగే రష్మికకు ఉన్న పాన్‌ ఇండియా క్రేజ్ కలిస్తే, ఈ చిత్రం భారీ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే, రష్మిక నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. వరుసగా కొత్త జానర్స్‌లో తనను తాను ప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్న రష్మిక ఇప్పుడు హారర్ ఫ్రాంఛైజీ లో కూడా ఎంట్రీ ఇస్తుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. రష్మిక కాంచన 4లో కనిపిస్తే బాక్సాఫీస్‌లో ఎంత హంగామా జరుగుతుందో చూడాలి మరి!

Exit mobile version