టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా తన తాజా బాలీవుడ్ చిత్రం అప్ డేట్ ను షేర్ చేసుకుంది. ధర్మ ప్రొడక్షన్స్‌లో కరణ్ జోహార్ తీస్తున్న ‘యోధ’ చిత్రంలో తాను కూడా భాగం కానున్నట్టు తెలియచేసింది. దిశా పటానీతో కలసి ‘యోధా’ టీమ్‌లో చేరబోతున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా లోగోను కూడా షేర్ చేసింది. నిజానికి రాశిఖన్నా 2013లో జాన్ అబ్రహాం నటించిన ‘మద్రాస్ కేఫ్’ తో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత బాలీవుడ్ లో రెండో సినిమా చేస్తోంది.
Read Also : వైరల్.. బిగ్‌బాస్-5 విన్నర్‌పై క్లారిటీ…!!
‘యోధా’ వచ్చే ఏడాది నవంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరో. ఇందులో దేశాన్ని రక్షించే సైనికుడిగా సిద్ధార్థ్ కనిపిస్తాడట. నవంబర్ లో ఈ సినిమా తొలి రోజు షూటింగ్ నుంచి కొన్ని గ్లింప్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘యోధా’ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తొలి ఏరియల్ యాక్షన్ ఫ్రాంచైజీ. ఈ చిత్రానికి సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో దాదాపు కనుమరుగవుతున్న రాశీ ఖన్నా ఈ సినిమాతో బాలీవుడ్ లోనైనా నిలదొక్కుకుంటుందేమో చూడాలి.
