Site icon NTV Telugu

Raashi Khanna :సీరియల్ ఆర్టిస్టుగా రాశీ ఖన్నా

New Project (35)

New Project (35)

గోపీచంద్ హీరోగా విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ స‌మ‌ర్పణ‌లో బ‌న్నీ వాస్ నిర్మాత‌గా జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై గోపీచంద్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ట్రైలర్, టీజర్, పాటలకు చక్కటి స్పందన వచ్చిన నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి రాశీ ఖన్నా లుక్ విడుదల చేసారు మేకర్స్. ఇందులో సీరియల్ ఆర్టిస్టుగా అందనిపీ నవ్వించడానికి రెడీ అయింది రాశీఖన్నా. ట్రైలర్‌ ని మించి సినిమాలో రాశీ పాత్ర ఫన్ తో ఉంటుందంటున్నారు మేకర్స్.

దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి టైటిల్ సాంగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కావచ్చిందంటూ జులై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నామన్నారు. గోపీచంద్ స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నాడని, ‘భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే’ వంటి విజయాలతో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేష‌న్స్ – బ‌న్నీవాసు కలయికలో ‘పక్కా కమర్షియల్’ వస్తోందని, సత్యరాజ్ మరోసారి కీలక పాత్రలో నటించారని సహ నిర్మాత‌ యస్.కె.యన్ తెలిపారు

Exit mobile version