NTV Telugu Site icon

Mrunal Thakur: మృణాల్‌తో డేటింగ్ న్యూస్.. పెదవి విప్పిన బాద్‌షా?

mrunal thakur

mrunal thakur

Rapper Badshah Clarity on Dating Rumors with Mrunal Thakur: సీతా రామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అనూహ్యంగా వార్తల్లోకి వస్తోంది. ఈ మరాఠీ భామ తెలుగులో విజయ్ దేవరకొండతో ఒక సినిమా, నాని హీరోగా మరో సినిమా చేస్తోంది. అయితే ఈ భామ అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ కారణంగా ఓ టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోబోతోందని వార్తలొచ్చాయి. అయితే అది నిజం కాదని స్వయంగా మృణాల్ ఠాకూర్ కూడా చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి మృణాల్ డేటింగ్‌లో ఉందంటూ మళ్ళీ ప్రచారం మొదలైంది. అలా ప్రచారం మొదలు కావడానికి ప్రధాన కారణం ముంబయిలో జరిగిన శిల్పాశెట్టి దివాళీ బాష్‌కు ఆమె మరొకరితో హాజరవ్వడమే. పార్టీకి హాజరైన మృణాల్ ఠాకూర్ ప్రముఖ బాలీవుడ్ ర్యాపర్ బాద్‌షాతో సన్నిహితంగా కనిపించింది.

Deepika: ముంబై వీధుల్లో క్యాబ్స్ లోనే సూట్‌కేస్‌తో పడుకునేదాన్ని!

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందని అంటూ ప్రచారం మొదలైంది. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని నెటిజన్స్ కామెంట్స్ వినిపిస్తున్న క్రమంలో మృణాల్ ఠాకూర్‌తో డేటింగ్ రూమర్స్‌పై ర్యాపర్‌ బాద్‌షా పరోక్షంగా స్పందించారు. మిమ్మల్ని నిరాశపరిచినందుకు నన్ను క్షమించండి, మీరు అనుకుంటున్నట్లు అలాంటిదేం లేదని తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు. అయితే ఎవరి గురించి ఆయన కామెంట్ చేశాడో, క్లారిటీ లేదు కాబట్టి వీరిద్దరి వస్తున్న రూమర్స్‌ గురించే ఈ పోస్ట్ పెట్టాడని అంటున్నారు. అయితే నిజానికి ఈ విషయంలో మృణాల్ ఠాకూర్ కూడా క్లారిటీ ఇస్తే తప్ప ఈ ప్రచారానికి బ్రేకులు పడే అవకాశం కనిపించడం లేదు. ఇక ప్రస్తుతానికి మృణాల్ ఠాకూర్ టాలీవుడ్‌లోనూ హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటిస్తోంది.

Show comments