Site icon NTV Telugu

రామ్ “ది వారియర్”… వార్ బిగిన్స్

The Warrior

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న ద్విభాషా చిత్రం టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. రామ్ ఈ ద్విభాషా చిత్రంతో కోలీవుడ్‌ లో అరంగేట్రం చేస్తున్నాడు. “RAPO19” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ ను ఈరోజు రివీల్ చేశామని మేకర్స్ ప్రకటించారు. అన్నట్టుగానే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్‌ని విడుదల చేశారు మేకర్స్. “ది వారియర్” అంటూ మూవీ టైటిల్ ను ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్. ఈ పోస్టర్‌ లో రామ్ పోతినేని తన పోలీసు బృందంతో కలిసి ఒక ముఖ్యమైన మిషన్‌లో పోలీసు అధికారిగా కనిపించాడు. రామ్ తొలిసారి పోలీస్‌గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులకు యాక్షన్‌ ట్రీట్‌గా ఉంటుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి.

Read Also : బన్నీ నార్త్ ఫ్యాన్స్ కు మరో ట్రీట్…. థియేటర్లలో “అల వైకుంఠపురములో” హిందీ వెర్షన్

యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు మారుపేరు డైరెక్టర్ లింగుసామి. ఇక రామ్ కు కూడా విశేషంగా మాస్ ఆఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కావడం, తాజా పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఆది పినిశెట్టి విలన్‌గా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, అక్షర గౌడ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్‌ క్యాస్ట్‌ ఉండడం కూడా సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న “ది వారియర్” చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ తాజాగా మొదలైంది.

Exit mobile version