కొన్ని నెలల క్రితం హీరో రామ్ పోతినేని తన కొత్త ప్రాజెక్ట్ #RAPO19 షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఆయన మెడకు గాయమైన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం కూడా ప్రకటిస్తూ కొన్ని నెలలు రామ్ విశ్రాంతి తీసుకుంటాడని తెలిపారు. అయితే ఈ విషయం ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అందుకే గత కొన్ని నెలలుగా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పుడు రామ్ మెడ గాయం నుండి పూర్తిగా కోలుకున్నాడు. దాదాపు 4 నెలల తర్వాత తిరిగి సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్నారు. వీలైనంత త్వరగా #RAPO19 సెట్స్‌లో జాయిన్ అవుతాడు. జనవరి 5 నుండి షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.
Read Also : అనారోగ్యంతో ఉన్న అభిమానికి రజనీకాంత్ సర్ప్రైజ్
తాజాగా రామ్ హైదరాబాద్‌లో తన అభిమానులతో సమావేశమయ్యారు. కోలుకున్న తర్వాత వారిని కలుస్తానని హామీ ఇచ్చారు. తన మాటకు కట్టుబడి రామ్ అన్నట్టుగానే కోలుకోగానే ముందుగా అభిమానులను కలుసుకున్నాడు. వారు తన కోసం తయారు చేసిన క్యాలెండర్‌లను ప్రారంభించాడు. రామ్ జనవరి 5వ తేదీ నుండి #RAPO19 సెట్స్‌లో జాయిన్ అవుతాడు. ఇక నుండి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎన్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.