NTV Telugu Site icon

Rao Ramesh: గొప్ప మనసు చాటుకున్న రావు రమేష్.. తండ్రిని మించావయ్యా!

Rao Ramesh

Rao Ramesh

Rao Ramesh: నటుడు రావు రమేష్ గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దివంగత నటుడు రావు గోపాల్ రావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ప్రస్తుతం విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో అదరగొడుతున్న రావు రమేష్ తాజాగా తన గొప్ప మనసును చాటుకున్నాడు. తన వద్ద పనిచేసే మేకప్ మ్యాన్ మృతి చెందగా ఆయన కుటుంబానికి రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందించాడు. స్వయంగా వారి ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి,చెక్ ను మేకప్ మ్యాన్ భార్యకు అందించాడు.

అనారోగ్యంతో రమేష్ మేకప్ మ్యాన్ బాబు మృతి చెందగా.. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. అయితే తమకు ఎవరు లేరని బాధపడవద్దని, ఆ కుటుంబానికి అండగా తానూ ఉంటానని భరోసా ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయం తెలియడంతో నెటిజన్లు ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తండికి తగ్గ కొడుకు అని మెచ్చుకొంటున్నారు. అప్పట్లో రావు గోపాల్ రావు కూడా తన వద్ద పని చేసిన వారిని కుటుంబ సభ్యులు లానే చూసుకొనేవారట. తండి వారసత్వాన్నే కాదు తండ్రి విలువలను కూడా పంచుకొనే కొడుకు గొప్ప అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక రమేష్ కెరీర్ విషయానికొస్తే పలు స్టార్ హీరోల సినిమాల్లో రావు రమేష్ నటిస్తున్నాడు.

Show comments