NTV Telugu Site icon

Rangasthalam: జపాన్‌లో రామ్ చరణ్‌ ‘రంగస్థలం’కి దిమ్మతిరిగే కలెక్షన్లు.. మొదటి రోజే రికార్డులు తిరగరాస్తూ!

Rangasthalam Movie Collections

Rangasthalam Movie Collections

Rangasthalam Movie japan Collections Creating New records: జపాన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు తిరుగులేని ఫాలోయింగ్ ఉందని చెప్పడానికి తాజాగా రిలీజ్ చేసిన రంగస్థలం కలెక్షన్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన రంగస్థలం సినిమాకు తెలుగులో వచ్చిన ప్రశంసలు అందరికీ తెలిసిందే. రామ్ చరణ్‌ నటనకు , సుకుమార్ టేకింగ్, మేకింగ్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవడమే కాదు రామ్ చరణ్ కెరీర్ లో ఆ సినిమా ది బెస్ట్ గా కూడా నిలిచింది. . చిట్టి బాబు పాత్రను రామ్ చరణ్‌ తప్ప మరే ఇతర హీరో చేయలేనంతగా నటించిన చరణ్ కలెక్షన్ల పరంగా కూడా ఆల్ టైం రికార్డు క్రియేట్ చేశారు. ఇక అలాంటి ఈ సినిమా జూలై 14న జపాన్‌లో డబ్ అయి రిలీజైంది. మొదటి రోజు ఈ సినిమాను డెబ్బై స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తే 2.5 మిలియన్ల యెన్స్(జపాన్ కరెన్సీ) వచ్చాయి. ఈ క్రమంలో జపాన్‌ డిస్ట్రిబ్యూటర్, స్పేస్ బాక్స్ సీఈవో అంబరసి దురైపాండ్యన్ మాట్లాడుతూ ఈ సినిమాను ముందుగా యాభై స్క్రీన్స్లో రిలీజ్ చేశాం, మున్ముందు మరిన్ని స్క్రీన్లు పెంచబోతోన్నామని అన్నారు.

Dakshin Ke Badrinath: హైదరాబాద్‌లో కొలువైన బద్రీనాథుడు.. ఈ ఆధ్యాత్మిక ప్రదేశం గురించి మీకు తెలుసా?

జపాన్ ప్రేక్షకుల్లో రామ్ చరణ్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంటుందని, రంగస్థలం సినిమాకు వచ్చిన రియాక్షనే దానికి నిదర్శనమని అన్నారు. రంగస్థలం లాంటి సినిమాలను జపాన్ ప్రేక్షకులకు అందించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్న ఆయన స్పేస్ బాక్స్ ద్వారా ఈ సినిమాను రిలీజ్ చేయడం మాకు ఎంతో గర్వంగా ఉందని ఈ సినిమా ఒక మాస్టర్ పీస్” అని అన్నారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే స్పేస్ బాక్స్ ద్వారా ఇప్పటికే జపాన్‌లో 250కి పైగా భారతీయ సినిమాలను రిలీజ్ చేశారు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాలను మరీ ముఖ్యంగా బజరంగీ భాయిజాన్, అంధాదున్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, బ్యాంగ్ బ్యాంగ్, సూపర్ 30, మాస్టర్, ఖైదీ, వారిసు, వాల్తేరు వీరయ్య, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ లాటి సూపర్ హిట్ సినిమాలను జపాన్‌లో విడుదల చేశారు. రామ్ చరణ్‌ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా వెలుగొందుతున్న క్రమంలో జపాన్‌లో రంగస్థలం కలెక్షన్లు రోజురోజుకూ పెరిగేలా కనిపిస్తున్నాయి.