NTV Telugu Site icon

Rangabali Teaser: వాడు ఎంత వెధవో వర్ణించాలంటే దేవుడు వరం ఇవ్వాలి

Shurya

Shurya

Rangabali Teaser: టాలీవుడ్ కుర్ర హీరో నాగశౌర్య గత కొంతకాలంగా భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈసారి ఆ హిట్ కోసం మనోడికి అచ్చొచ్చిన ఛలో సినిమా లాంటి కథనే నమ్ముకున్నాడు. అదే రంగబలి. రంగస్థలంలో రంగ.. బాహుబలిలో బలి కలిపి రంగబలిగా కొత్త టైటిల్ ను తీసుకొచ్చేశారు మేకర్స్. పవన్ బసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో నాగశౌర్య సరసన యుక్తి తరేజా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. ఈ టీజర్ ను చూస్తుంటే ఖచ్చితంగా శౌర్య నటించిన ఛలో సినిమా గుర్తురాకమానదు.

Siddharth: ఆమెను చూసి స్టేజిమీదనే కళ్లనీళ్లు పెట్టుకొని.. కాళ్లు పట్టుకున్న సిద్దార్థ్.. ఎవరామె ..?

“కుర్రాళ్ళు అంటే ఈ వయస్సులో ఇలాగే ఉంటారురా.. నువ్వేం కంగారు పడకు” అని హీరో తండ్రికి.. అతడి ఫ్రెండ్ చెప్తున్న డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. ఇక దానికి కొడుకు వెధవ పనుల గురించి తండ్రి ఏకరువు పెట్టేయడం చూపించారు.. ” మా వాడు ఎంత వెధవ అనేది నేను చెప్పలేను.. వాడి వెధవతనాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి” అని చెప్పే డైలాగ్ తోనే హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని చూపించారు. ఇ తండ్రి పోరు పడలేక.. బి ఫార్మసీ.. చదివిన హీరో.. ఒక హాస్పిటల్ లో అప్రెంటీస్ గా చేరతాడు. అక్కడ డాక్టర్ గా పనిచేస్తున్న హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఆమె దగ్గర గొడవలు అంటే గిట్టని వాడిగా నటిస్తూ ఉంటాడు. కానీ, ఆ ఊరి రాజకీయా నాయకుడితో ఒక గొడవపెట్టుకుంటాడు. అసలు ఆ గొడవ ఏంటి..? హీరో చివరికి మారతాడా..? డాక్టర్ తో ప్రేమ ఫలిస్తుందా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. శౌర్యను ఇలాంటి పాత్రలో ఆల్రెడీ ఛలోలో చూసేశాం.. కానీ, ఈసారి అంతకుమించిన కథతో వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శౌర్య- సత్యల మధ్య కామెడీ హైలైట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమా జూలై 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రంతోనైనా శౌర్య హిట్ కొడతాడేమో చూడాలి.

Show comments