Site icon NTV Telugu

Ranbir – Alia Wedding : బరాత్‌ కు నో పర్మిషన్ ?

Ranabir And Alia

Ranabir And Alia

బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ ల వివాహ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 13న రణబీర్ – అలియాల మెహందీ వేడుక జరిగింది. ఈ వేడుకలో ఇద్దరు స్టార్స్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ, రిద్ధిమా కపూర్ సాహ్ని, నీతూ కపూర్, సోనీ రజ్దాన్, షాహీన్ భట్, పూజా భట్, మహేష్ భట్, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్ వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఏప్రిల్ 14న ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత ఈ జంట మొదటిసారి భార్యాభర్తలుగా పోజులివ్వనున్నారు. అయితే ఇప్పుడు స్టార్ కపుల్ పెళ్లి చేసుకున్నాక బరాత్ ఉంటుందా ? ఉండదా? అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.

Read Also : KGF Chapter 2 : బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్… మరో పార్ట్ లోడింగ్

రణబీర్ కపూర్ పెళ్లి బరాత్‌ కృష్ణ రాజ్ బంగ్లా నుండి వాస్తు బంగ్లా వరకు జరుగుతుందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కానీ తాజా సమాచారం ప్రకారం బరాత్‌కు సంబంధించి పాలి హిల్ అధికారుల నుండి కపూర్ కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. మరి దీనికి కారణం భద్రత సమస్యా? లేక మరేదైనా ప్రత్యేక కారణం ఉందా ? అనేది తెలియరాలేదు. కానీ సదరు ప్రాంతం నుంచి పోలీసు రక్షణ, అదనపు అనుమతి మాత్రం లభించిందట. ఇక మధ్యాహ్నం 2 గంటల తర్వాత పెళ్లి వేడుక స్టార్ట్ అవుతుండగా, పెళ్లి వేడుకకు సంబంధించిన భవనం, ఆ చుట్టుపక్కల భద్రత అయితే కట్టుదిట్టం అవుతుంది. భారీ బందోబస్తు మధ్య రణబీర్ కపూర్,, అలియా భట్ ల వివాహం జరగబోతోంది. కేవలం పోలీస్ భద్రత మాత్రమే కాకుండా 200 మంది ప్రైవేట్ బౌన్సర్లను కూడా నియమించారట.

Exit mobile version