Site icon NTV Telugu

Ranbir Kapoor: పవన్ కళ్యాణ్ పేరు చెప్పి రచ్చ చేసిన బాలీవుడ్ హీరో

Pawan

Pawan

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా ఆయన ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర. ప ఇండియా లెవల్లో అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతున్న ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం విశేషం. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌని రాయ్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ అనౌన్స్ మెంట్ వేడుకను వైజాగ్ లో అభిమానుల సమక్షంలో నిర్వహించారు. ఈ వేడుకలో రణబీర్ కపూర్ టాలీవుడ్ హీరోల గురించి అభిమానుల్లో ఊపు తెప్పించాడు.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి చెప్పి రచ్చ లేపారు. టాలీవుడ్ లో మీకు ఇష్టమైన హీరోలు ఎవరు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రణబీర్ మాట్లాడుతూ “నేను దక్షిణాది సినిమాకు పెద్ద అభిమానిని. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, ప్రభాస్‌ అంటే చాలా ఇష్టం. పవన్‌కల్యాణ్‌గారంటే విపరీతమైన ప్రేమ.. ఆయన స్వాగ్ అంటే చాలా ఇష్టం. తారక్‌, రామ్‌చరణ్‌ నాకు మంచి మిత్రులు.. ఇక వీరందరిలో ఒకరినే ఎంచుకోమంటే నేను ప్రభాస్ ను ఎంచుకుంటాను.. నా ఫేవరేట్ హీరో ప్రభాస్” అని తెలిపారు. ప్రస్తుతం రణబీర్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా పవన్ స్వాగ్ గురించి రణబీర్ లాంటి బాలీవుడ్ హీరో చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో రచ్చ చేస్తున్నారు.

Exit mobile version