NTV Telugu Site icon

Ranbir Kapoor: స్పిరిట్ లో ప్రభాస్ కు పోటీగా దిగితే.. అనిమల్ దిగదుడుపే..?

Ranbir

Ranbir

Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్.. అనిమల్ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు. ముఖ్యంగా తెలుగువారికి బాగా దగ్గరయ్యాడు. సందీప్ రెడ్డి వంగా.. రణబీర్ ను చూపించిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక రణబీర్ కెరీర్ లో అనిమల్ లాంటి సినిమా ది బెస్ట్ గా నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అనిమల్ తరువాత రణబీర్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక తాజాగా రణబీర్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా మారాడు. ఏంటి ఏదైనా కొత్త సినిమానా అని ఆశ్చర్యపడకండి. అది కేవలం యాడ్ కోసం మాత్రమే. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణబీర్ ఒక యాడ్ షూట్ చేస్తున్నాడు. అందులో రణబీర్ పోలిస్గ్ గా దర్శనమిచ్చాడు. మాస్ రగ్గడ్ లుక్ లో బాలీవుడ్ చాక్లెట్ బాయ్ అదిరిపోయాడు. తీరైన మీసకట్టు.. లైట్ గా ట్రిమ్ చేసిన గడ్డం.. టైట్ పోలీస్ యూనిఫార్మ్ లో సింగంలా కనిపించాడు. ప్రస్తుతం రణబీర్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఇదే లుక్ లో ఒక సినిమా పడితే.. బావుంటుందని చెప్పుకొస్తుండగా.. ఇంకొందరు మాత్రం సందీప్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ లో రణబీర్ ఈ లుక్ లో నటిస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పుకొస్తున్నారు. స్పిరిట్ లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తున్న విషయం తెల్సిందే. ఇక రణబీర్ సైతం ఈ లుక్ లోకనీసం ఒక చిన్న షాట్ లో కనిపించినా కూడా రికార్డ్స్ లో అనిమల్ దిగదుడుపే అని చెప్పుకొస్తున్నారు. ఎలానూ.. సందీప్- రణబీర్ అనిమల్ పార్క్ కోసం కలవాల్సిందే. అంతకు ముందే స్పిరిట్ లో రణబీర్ క్యామియో ఏదైనా సెట్ చేస్తే వేరే లెవెల్ ఉంటుందని అంటున్నారు. త్వరలోనే స్పిరిట్ షూట్ మొదలు కానుంది. మరి ఈ సినిమాతో వంగా ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.