NTV Telugu Site icon

Ranbir-Alia Video Viral : మోకాళ్లపై కూర్చుని, లిప్ లాక్ తో… సినిమాను మించిన వరమాల సీన్ !

Ranabir And Alia

Ranabir And Alia

5 సంవత్సరాల డేటింగ్ తర్వాత స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. 2020 నుండే వీరిద్దరి పెళ్లి జరగనుందని ప్రచారం జరిగింది. కానీ ఎట్టకేలకు ఏప్రిల్ 14న పెళ్లి పీటలెక్కిన రణబీర్, అలియా ఇప్పుడు అధికారికంగా భార్యాభర్తలు! ఇక పెళ్ళైన వెంటనే ఈ కొత్త జంట బయటకు వచ్చి మీడియాకు కన్పించి, ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుండగా, తాజాగా మరో వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్న ఈ జంట… పెళ్లి తంతులో అత్యంత ఆసక్తికరమైన సన్నివేశం వరమాలకు సంబంధించి ఉన్న ఈ వీడియోకు, అందులో అలియాపై రణబీర్ తన ప్రేమను వెల్లడించిన విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Read Also : Pooja Hegde : మరో స్పెషల్ సాంగ్… ఫన్ అండ్ ఫ్రస్టేషనే కాదు ఫైర్ కూడా !!

వైరల్ అవుతున్న ఈ వీడియోలో అలియా… రణబీర్ మెడలో వరమాల వేయడానికి ప్రయత్నిస్తుండగా, ఆయన బంధువులు రణబీర్ ని అలియాకు అందకుండా పైకి లేపారు. అయితే అలియా దండ వేయడానికి కష్టపడడం చూసిన రణబీర్ వెంటనే మోకాళ్లపై కూర్చుని ఆమెకు అందుబాటులోకి వచ్చాడు. ఆ తరువాత అలియా మేడలో వరమాల వేసి, లిప్ లాక్ తో తన ప్రేమను వ్యక్తపరిచారు. సినిమాటిక్ రేంజ్ లో ఈ సన్నివేశం ఉండడం అక్కడున్న అందరినీ ఆకట్టుకుంది. కాగా రణ్‌బీర్, అలియాల వివాహానికి ముందు ప్రత్యేక పూజలు, మెహందీ వేడుకలు జరిగాయి. ఇక పెళ్లి వేడుకలో రణబీర్ తల్లి నీతూ కపూర్, సోదరి రిద్ధిమా కపూర్ సాహ్ని, కజిన్స్ కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, అత్త రీమా కపూర్‌లతో సహా అలియా బంధువులు, పలువురు అతిథులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు.