Ranasthali: నూతన నటీనటులు ధర్మ, చాందిని రావు జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రణస్థలి.అనుపమ సూరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క టీజర్ ను నిన్న వెంకటేష్ రామానాయుడు స్టూడియోలో రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక ఈ టీజర్ రిలీజ్ చేశాక వెంకటేష్ మాట్లాడుతూ “రణస్థలి టీజర్ చాలా బాగుంది యంగ్ టీమ్, కొత్త డైరెక్టర్ అయినా పరశురాం గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు, వయలెన్స్ బ్యాక్ డ్రాప్ తో చాలా బాగా తీశారు. డైలాగ్స్ చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి, మ్యూజిక్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అని ప్రశంసిస్తూ టీం అందరికీ అల్ ద బెస్ట్” అని అన్నారు.
ఇక వెంకీ చెప్పినట్లుగానే ఈ టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా నారప్ప ఫేమ్ అమ్ము అభిరామి నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆమెకు ఈ సినిమాతో మంచి విజయం అందాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ టీజర్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది. హీరో పవర్ ఫుల్ యాక్షన్ బావుందని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో ఈ చిత్ర బృందం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
