NTV Telugu Site icon

Rana Daggubati: తండ్రి కాబోతున్న రానా.. మిహీక పోస్ట్ వైరల్..?

Rana

Rana

Rana Daggubati: దగ్గుబాటి రానా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఉండే రానా 2020 లో తన సింగిల్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టి తాను ప్రేమించిన మిహీక బజాజ్ తో ఏడడుగులు నడిచి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. మిహీక ఒక బిజినెస్ విమెన్. నిత్యం సోషల్ మీడియాలో తన వర్క్ తో పాటు ఫ్రెండ్స్ తో ఛిల్ల్ అయిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇక రానా- మిహీక మీద రూమర్స్ కూడా కొత్తేమి కాదు. మిహీక ప్రెగ్నెంట్ అంటూ ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. కానీ, అవేమి నిజం కాదని, అలా జరిగినప్పుడు తామే అభిమానులకు చెప్తామని ఈ జంట రూమర్స్ కు చెక్ పెట్టారు. అప్పటినుంచి ఇలాంటి రూమర్స్ మళ్లీ పుట్టలేదు.

Hardik Pandya: రాసి పెట్టుకోండి.. రెండేళ్లలో అతడు తురుపుముక్క అవుతాడు

అయితే తాజాగా మిహీక పోస్ట్ చేసిన వీడియోతో మరోసారి ఈ వార్తలు మొదలయ్యాయి. బీచ్ ఒడ్డున ఒక లూజ్ డ్రెస్ లో చెప్పులు లేకుండా నడుస్తూ కనిపించింది మిహీక. ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఈ వీడియోలో ఆమె బేబీ బంప్ తో ఉన్నట్లు కనిపిస్తుంది అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ఆ లూజ్ డ్రెస్ లో బేబీ బంప్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీంతో నెటిజన్లు.. రానా దంపతులకు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు. గతంలో వచ్చిన పుకార్లపై క్లారిటీ ఇచ్చినట్లే ఈ జంట ఈసారి కూడా క్లారిటీ ఇస్తుందా.. లేక చరణ్- ఉపాసన లా తీపి కబురు చెప్తుందా అనేది చూడాలి.