NTV Telugu Site icon

Rana Naidu Trailer: నేను నీ బాబును రా.. వెంకీ- రానాల నట విశ్వరూపం

Rana

Rana

Rana Naidu: విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కిన వెబ్ సిరీస్ రానా నాయుడు. నెట్ ఫ్లిక్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సిరీస్ కు కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సిరీస్ లో రానా పోలీసాఫీసర్ గా కనిపించగా.. వెంకటేష్ క్రిమినల్ గా కనిపించనున్నాడు. గత రెండు రోజులుగా రానా, వెంకటేష్.. సోషల్ మీడియాలో ఒకరికి ఒకరు వార్నింగ్ లు ఇచ్చుకుంటూ సిరీస్ ట్రైలర్ గురించి అప్డేట్ ఇచ్చి ఆసక్తి పెంచారు. ఇక తాజాగా ముంబైలో ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది.

Laya Gorty: హీరోయిన్ లయ కూతురును చూశారా.. అచ్చుగుద్దినట్లు తల్లిని దింపేసింది

రానా నాయుడు ఒక పోలీసాఫీసర్. బాలీవుడ్ సెలబ్రిటీలందరికి రక్షణ కవచం. అక్కడ జరిగే స్కామ్ ల అన్నింటి వెనుక రానా హస్తం ఉంటుంది. ఇక రానా తండ్రి నాగ నాయుడు జైలు నుంచి తిరిగి వస్తాడు. తండ్రి కొడుకులకు అస్సలు పడదు. కుటుంబం కోసమే నాగ జైలుకు వెళ్లినట్లు చూపించారు.. తండ్రి క్రిమినల్ అని తెలిసి రానా అతడిపై అసహ్యించుకున్నట్లు తెలుస్తోంది. ఇక జైలు నుంచి బయటికి వచ్చాకా.. ఒక స్కామ్ లో రానా ఇరుక్కోవడం.. అందుకు తండ్రి కారణమవ్వడంతో తండ్రిని అరెస్ట్ చేయడానికి బయల్దేరతాడు.. తండ్రి కొడుకుల మధ్య యుద్దానికి కారణం ఏంటి.. ఒకరికి ఒకరంటే ఎందుకు పడదు.. చివరికి ఈ తండ్రి కొడుకులు ఏమవుతారు..? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. పోలీస్ గా రానా అదరగొట్టగా.. క్రిమినల్ నాగలా వెంకీ మామ జీవించేసాడు. ముఖ్యంగా ఆ నెరిసిన గడ్డం, జుట్టుతో అల్ట్రా స్టైలిష్ గా కనిపించాడు. బాలీవుడ్ సిరీస్ కాబట్టి కొన్ని బూతులు కూడా వెంకీ మామ నోటి నుంచి వినిపించాయి. యాక్షన్ సీక్వెన్స్ అయితే ఇక చెప్పనవసరం లేదు. ముఖ్యంగా రానా- వెంకీల మధ్య ఫైట్స్ సిరీస్ కు హైలైట్ గా నిలుస్తాయి. ఇక చివర్లో రానా, వెంకీల చిన్నపాటి ఫోటో చూపించడం ఆకట్టుకుంది. ఇక వెంకీకి గన్ గురిపెట్టిన రానాకు.. నీ బాబునురా నేను అంటూ డైలాగ్ చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్ తో సిరీస్ పై అంచనాలను పెంచేశారు మేకర్స్. ఈ సిరీస్ తో ఈ బాబాయ్- అబ్బాయ్ విశ్వరూపం చూడబోతున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ సిరీస్ తో ఈ తండ్రీకొడుకులు ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలంటే మార్చి 10 వరకు ఆగాల్సిందే.