NTV Telugu Site icon

Rana Naidu: బూతులు ఉన్నాయంటారు.. అయినా ట్రెండింగ్ లో ఉంచేస్తారు

Rana

Rana

Rana Naidu: దగ్గుబాటి వారసులు వెంకటేష్, రానా మల్టీస్టారర్ గా తెరకెక్కిన సిరీస్ రానా నాయుడు. నేటి ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే. ఇక వెంకటేష్ మొట్టమొదటిసారి వెబ్ సిరీస్ చేయడం..రానా, వెంకీ కలిసి నటించడంతో ఈ సిరీస్ పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక సిరీస్ రిలీజైన మొదటిరోజు నుంచే విమర్శలు మొదలయ్యాయి. అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్నాయని, విపరీతమైన శృంగార సన్నివేశాలు, ముఖ్యంగా వెంకీ బూతులు మాట్లాడడం ఏంటి అంటూ ట్రోల్స్ చేశారు. ఇక మహిళలు, కుటుంబంతో సహా కలిసి ఈ సిరీస్ ను చూడలేరు. అయితే ఈ సిరీస్ ను మేకర్స్ కుటుంబంతో చూడవద్దని వార్న్ చేసిన విషయం విదితమే. అయినా వెంకీ మామ నటించడంతో అందరూ ఈ సిరీస్ ను చూసి ఖంగుతిన్నారు.

Oscar For Naatu Naatu: ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్.. ఉపేంద్ర ఏం అన్నాడంటే..

ఇక ఎంత విమర్శలు అందుకుంటే అంత ఎక్కువ ట్రెండింగ్ లో ఉంటుంది అన్నట్లు ఉంది ఈ సిరీస్. నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. బూతులు, మితిమీరిన శృంగారం, వైలెన్స్ ఉన్నా కూడా అభిమానులు ఈ సిరీస్ ను టాప్ ట్రెండింగ్ లో ఉంచారు. కొన్ని కొన్ని సీన్స్ ను పక్కన పెడితే.. యాక్షన్ అభిమానులకు ఈ సిరీస్ నచ్చిందని చెప్పుకొస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ప్రస్తుత కాలంలో పాజిటివ్ టాక్ కన్నా నెగెటివ్ టాక్ రావడమే గొప్పగా ఉంటుంది. పాజిటివ్ టాక్ వస్తే ఒక రెండు మూడు రోజులు మాట్లాడుకొని వదిలేస్తున్నారు. అదే నెగెటివ్ టాక్ అందుకుంటే.. ఎందుకు వీరు నెగెటివ్ అన్నారు అని చూసే ప్రేక్షకులే ఎక్కువ మంది ఉంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఏదిఏమైనా నెగెటివ్ టాక్ అని చెప్పిన వారే.. ఈ సిరీస్ ను టాప్ ట్రెండింగ్ లో ఉంచారు. మరి ముందు ముందు ఈ సిరీస్ ఎలాంటి రికార్డును అందుకుంటుందో చూడాలి.

Show comments