Site icon NTV Telugu

Rana Daggubati: తండ్రి కాబోతున్న రానా..?

rana daggubati

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి గతేడాది కరోనా లాక్ డౌన్ సమయంలో అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న రానా, మిహికాను వివాహమాడి ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయాడు. ఇక వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే గత కొన్నిరోజులుగా రానా తండ్రి కాబోతున్నాడు అంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. పెళ్లి తరువాత మిహికా సోషల్ మీడియాలో భర్త రానాతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక ఇటీవల మిహికా షేర్ చేసిన ఫొటోలో కొద్దిగా బొద్దుగా కనిపించింది. దీంతో అభిమానులు మిహికా మీరు తల్లికాబోతున్నారా..? కొంచెం బొద్దుగా కనిపిస్తున్నారు అని అడిగాడు. ఇక దీనికి సమాధానంగా మిహికా.. అలాంటిదేమి లేదు.. ఇది పెళ్లి తరువాత అమ్మాయిలో వచ్చే మార్పు మాత్రమే అని చెప్పుకొచ్చింది. దీంతో రానా అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. మిహికా ప్రెగ్నెంట్‌ అంటూ వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లయ్యింది. మరి త్వరలోనే ఈ జంట శుభవార్తను చెప్తుందేమో చూడాలి. ఇక రానా సినిమాల విషయానికొస్తే .. ప్రస్తుతం ఈ హీరో, బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.

Exit mobile version