నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో నిరాటకంగా కొనసాగుతోంది.స్టార్ హీరోలు, బాలయ్య పంచ్ లు, కావాల్సినంత వినోదం అందుతుండడంతో అభిమానులు ఈ షో కి ఫిదా అయిపోతున్నారు. ఇక మహేష్ బాబు ఎపిసోడ్ తో సీజన్ ముగిస్తున్నాము అని ఆహ వారు ప్రకటించిన విషయం తెలిసిందే. మహేష్ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా రానుంది. ఇక మధ్యలో మరో స్టార్ హీరో తో బాలయ్య రచ్చ చేయనున్నాడు.
ఇక ఇటీవలే 7వ ఎపిసోడ్ లో రవితేజ, గోపీచంద్ మలినేని తో కలిసి రచ్చ చేసిన బాలయ్య 8వ ఎపిసోడ్ లో దగ్గుబాటి వారసుడు రానా దగ్గుబాటి తో సందడి చేయనున్నాడు. ఈ విషయాన్ని ఆహా మేకర్స్ ప్రకటిస్తూ సెట్ లో ఉన్న బాలయ్య, రానా ల ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. యంగ్ హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన కూడా హోస్ట్ గా వ్యవహరించారు. దీంతో ఇద్దరి హోస్ట్ ల మధ్య జరిగే సంభాషణ ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే శుక్రవారం ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. మరి రానాను బాలయ్య ఏ విధంగా ఆడుకుంటాడో చూడాలంటే మరో వారం ఆగాల్సిందే.
