టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘విరాట పర్వం’. ఈ సినిమా షూటింగ్ పూర్తయియ్యే చాలా రోజులే అవుతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఓపెన్ అయినా కూడా విరాటపర్వంపై ఎలాంటి అప్డేట్ లేదు. ఆయా సినిమాలు కొత్త పోస్టర్లు, పాటలు విడుదల చేస్తూ కుదిరితే విడుదల తేదీలు కూడా ప్రకటిస్తున్నాయి. అయితే విరాటపర్వం నుంచి మాత్రం సెకండ్ వేవ్ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఫ్యాన్స్ కొద్దిగా నిరాశ చెందుతున్నారు. దసరా బరిలో దిగిన కూడా ఇప్పటికే నుంచే ప్రమోషన్స్ వేగాన్ని పెంచాల్సి ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో అది కనిపించటం లేదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ సినిమాని డిజిటల్ మాధ్యమంలో విడుదల చేసే ఉద్దేశం లేదని, ఎప్పటికైనా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని దర్శకుడు ఇదివరకే తెలిపారు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. దగ్గుబాటి సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 30న ఈ సినిమా విడుదల కావాల్సివుండగా, కొవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా వాయిదా పడింది.