Site icon NTV Telugu

రామ్ చరణ్, రానా బ్రొమాన్స్… పిక్ వైరల్

rana

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కలిసి ఉన్న తాజా పిక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీరిద్దరి బ్రొమాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రానా దగ్గుబాటి తన నూతన సంవత్సర వేడుక నుండి రామ్ చరణ్‌తో హృదయపూర్వక ఫోటోను పంచుకున్నారు. ఇది వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని చూపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను షేర్ చేస్తూ రానా గత 30 ఏళ్లుగా కలిసే ఉన్నామంటూ “హ్యాపీ న్యూ ఇయర్ మ్యాన్” అని రాశాడు. బాల్యం నుండీ వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది. అంతేకాదు చెన్నైలో ఇద్దరూ కలిసి ఒకే పాఠశాలలో చదివారు.

Read Also : పెద్దరికం నాకొద్దు… మెగాస్టార్ సెన్సేషనల్ కామెంట్స్

సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్, రానా దగ్గుబాటి తమ రాబోయే చిత్రాలతో బిజీగా ఉన్నారు. చరణ్ తన నెక్స్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 7న థియేటర్‌లలో విడుదల కావాల్సి ఉంది. కానీ కోవిడ్-19 సమస్యల కారణంగా ఈ మూవీ వాయిదా పడింది. మరోవైపు ‘అరణ్య’లో చివరిగా కనిపించిన రానా దగ్గుబాటి ఆ తర్వాత ‘భీమ్లా నాయక్‌’లో కనిపించనున్నాడు. ప్రస్తుతం రానా నటించిన ‘విరాట పర్వం’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

Exit mobile version