తెలుగు చిత్ర పరిశ్రమలో ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు రానా దగ్గుబాటి. లీడర్ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమ లో హీరోగా పరిచయం అయ్యారు.లీడర్ సినిమా తో మంచి సక్సెస్ అందుకున్నారు రానా.ఆ తరువాత ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి బాగా మెప్పించారు. అయితే ఈయన హీరోగా మాత్రమే కాకుండా కథ బాగుంటే విలన్ పాత్ర లలో కూడా నటించి మెప్పిస్తున్నారు.ఈ క్రమంలో నే రానా బాహుబలి వంటి భారీ సినిమా లో విలన్ పాత్ర లో నటించిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా బాహుబలి సినిమాలో విలన్ గా నటించిన రానా తరువాత పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా ఈయన డానియల్ శేఖర్ పాత్ర లో ఎంతో అద్భుతం గా నటించి మెప్పించారు.ఇలా విలన్ గా రానా ఎంతో అద్భుతంగా సెట్ అయ్యారు.అయితే తాజాగా మరోసారి విలన్ గా ఈయన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయినట్లు సమాచారం.టాలీవుడ్ యంగ్ హీరో అయిన నిఖిల్ హీరో గా నటిస్తున్న స్పై సినిమా త్వరలోనే విడుదల కానున్న సంగతి మనకు తెలిసిందే. జూన్ 29వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమాలో ఒక ముఖ్య సన్నివేశంలో రానా విలన్ పాత్ర లో కనిపించబోతున్నట్లు సమాచారం..రానా పాత్ర ఈ సినిమాని కీలక మలుపు తిప్పబోతుందని తెలుస్తుంది.మరి ఈ సినిమా తో రానా మరోసారి విలన్ గా అదరగొట్టబోతున్నట్లు తెలుస్తుంది.హీరో నిఖిల్ కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాల ను చేస్తున్న విషయం తెలిసిందే. కార్తికేయ 2 సినిమా తరువాత వరుసగా పాన్ ఇండియా కథల కు ఓకే చెప్తున్నాడు నిఖిల్. అందులో భాగంగా తను నటిస్తున్న స్పై సినిమా ఎంతో ఆసక్తికరం గా థ్రిల్లింగ్ గా ఉండనుందని సమాచారం. నిఖిల్ తో పాటు రానా కూడా తోడైతే ఈ సినిమా ఇంకెలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు