రమ్య కృష్ణ.. పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అప్పటికి ఇప్పటికి చెక్కు చెదరని అందంతో కుర్రకారును ఫిదా చేస్తుంది.. ఈ సీనియర్ బ్యూటీ క్రేజ్ మాములుగా లేదు.. ఎక్కడ కనిపించిన జనాలు ఎగబడుతున్నారు.. ఆమె చేస్తున్న ప్రతి సినిమా జనాలకు కనెక్ట్ అవుతుంది.. తాజాగా రంగమార్తాండా సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.. ఆ సినిమా మంచి టాక్ ను అందుకోవడంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటించనుంది..
అయితే, తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. కన్నడ స్టార్ హీరో రాఖీ బాయ్ అలియాస్ యాష్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది.. ఆ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది.. బెంగుళూరులో జరిగిన అభిషేక్ అంబరీష్ వివాహానంతర వేడుకలో తన అద్భుతమైన డ్యాన్స్ తో కన్నడ సార్ యష్ మళ్లీ తన అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. KGF స్టార్ బాహుబలి ఫ్రాంచైజీలో శివగామి పాత్రలో నటించిన రమ్య కృష్ణన్‌తో కలిసి డ్యాన్స్ చేశాడు.. అందుకు సంబందించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. అభిషేక్ అంబరీష్ కన్నడ సూపర్ స్టార్ రాజకీయ నాయకుడు అంబరీష్, ప్రముఖ నటి, ఎంపీ సుమలత కుమారుడు.
దివంగత అంబరీష్ యశ్‌కు గురువు. గత పార్లమెంట్ ఎన్నికల్లో దర్శన్‌తో కలిసి యష్ సుమలత తరపున ప్రచారం చేశారు. మాజీ ప్రధాని హెచ్‌డి మనవడు నిఖిల్ కుమారస్వామి పై సుమలత భారీ మెజార్టీతో గెలుపొందారు.. అభిషేక్ అంబరీష్ వివాహ రీసెప్షన్ కన్నుల పండుగగా జరిగింది.. ఆ ఈవెంట్ కు యష్ హైలెట్ గా నిలిచాడు.. ఇక సినిమాల విషయానికొస్తే.. యష్ పలు కన్నడ సినిమాలతో బిజీగా ఉన్నాడు.. అలాగే యాడ్ షూటింగ్స్ కూడా చేస్తున్నాడు.. ఇక రమ్యకృష్ణ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.. సోషల్ మీడియాలో కూడా రమ్య కృష్ణ యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ లుక్ ఫోటోలను షేర్ చేస్తుంది..