గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రెజెంట్ ఎటువంటి సినిమా షూటింగ్లో కూడా పాల్గొనకుండా ఇంటి వద్దనే ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ పాన్ ఇండియా సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.. అయితే రాంచరణ్ గత నెల రోజుల నుంచి ఈ సినిమా షూటింగుకు బ్రేక్ ను ఇచ్చారు. అయితే ఈ బ్రేక్ మరికొన్ని రోజులపాటు పొడిగిస్తున్నట్లు సమాచారం. ఈయన ఆగస్టు నెల వరకు తన షూటింగ్ కు లాంగ్ బ్రేక్ ఇచ్చారని తెలుస్తుంది.రాంచరణ్ షూటింగుకు విరామం ఇవ్వడానికి కారణం కూడా ఉంది.పెళ్లై దాదాపు పది సంవత్సరాలకు తన భార్య తల్లి కాబోతుండడంతో రాంచరణ్ తన పూర్తి సమయాన్ని తన భార్యకే కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే ఆగస్టు వరకు ఎలాంటి షూటింగ్స్ ఉండబోవు అంటూ ఈయన షూటింగ్ కు విరామం ప్రకటించారని సమాచారం..ప్రస్తుతం ఉపాసన ఎనిమిదవ నెల గర్భిణీగా ఉంది.ఈమె జులై మొదటి వారంలోనే తన బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సమాచారం.అందుకే ఎటువంటి వర్క్ టెన్షన్ లేకుండా రాంచరణ్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారని తెలుస్తుంది..
ఇలా సినిమా షూటింగ్లకు బ్రేక్ తీసుకున్న ఈయనతన పూర్తి సమయాన్ని తన భార్య కోసం అలాగే తనకు పుట్టబోయే బిడ్డ కోసం కేటాయించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇలా తన బిడ్డ అలాగే భార్య కోసం తన పూర్తి సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నారు. అయితే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న గేమ్ చేంజర్ సినిమా ఆగస్టు తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.అయితే ఈ గ్యాప్ లో దర్శకుడు శంకర్ తన పూర్తి సమయం ఇండియన్ 2 సినిమా పై పెడుతున్నట్లు సమాచారం. ఈ సినిమాను రాంచరణ్ సినిమా కంటే ముందు మొదలు పెట్టిన కొన్ని అనివార్య కారణాలతో ఈ షూటింగ్ కు బ్రేక్ పడింది. కమల్ హాసన్ కారణంగా ఈ సినిమా మళ్ళీ మొదలు అయ్యింది. త్వరలోనే దర్శకుడు శంకర్ నుండి రెండు భారీ సినిమాలు విడుదల కానున్నాయి.