Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘రామాయణ పార్ట్ వన్’ నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ అంచనాలతో పాటు చర్చలకు కూడా కారణమవుతోంది. టీజర్ పై విఎఫ్ఎక్స్ విషయంలో విమర్శలు, ట్రైలర్ తర్వాత కాస్టింగ్, లుక్స్ పై కామెంట్స్… ఇప్పుడు ‘జై జై రామ్’ పాటపై కొత్త చర్చ! ఈ సాంగ్ నిజంగా కొత్త భక్తి అనుభూతిని ఇస్తుందా? లేక పాత ట్యూన్ ఫీల్ నే కొత్తగా ప్యాకేజ్ చేశారా? ‘రామాయణ’ టీజర్ వచ్చినప్పుడు సినిమాపై ఉన్న భారీ అంచనాలకు తగ్గట్టుగా విజువల్స్ లేవంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. గ్రాఫిక్స్ విషయంలో ట్రోలింగ్ జరిగింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాను ‘ఆదిపురుష్’తో పోలుస్తూ వచ్చారు. అయితే మేకర్స్ మాత్రం ఫైనల్ వర్షన్ విషయంలో క్వాలిటీ పై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. ట్రైలర్ వచ్చాక మాత్రం ‘రామాయణ’పై చర్చ మరో మలుపు తిరిగింది. ముఖ్యంగా యష్ రావణుడి పాత్రలో కనిపించిన తీరు, అతని స్క్రీన్ ప్రెసెన్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. అదే సమయంలో సీతగా సాయి పల్లవి లుక్, హిందీ డైలాగ్ డెలివరీ పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చింది. టీజర్ లో విఎఫ్ఎక్స్ పై చర్చ జరిగితే, ట్రైలర్ తర్వాత కాస్టింగ్, క్యారెక్టర్ లుక్స్ హాట్ టాపిక్ గా మారాయి.
వినాయక చవితి సందర్భంగా ‘జై జై రామ్’ పాటతో ‘రామాయణ’ మ్యూజిక్ జర్నీని మొదలు పెట్టింది. ఈ పాటకు ఏఆర్ రెహ్మాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందించారు. ఈ భక్తి గీతంలో ‘సియారామ్ సియారామ్’ అనే హుక్ లైన్ వెంటనే క్యాచ్ అయ్యేలా ఉంది. అయితే ఇంతటి భారీ మ్యూజిక్ కాంబినేషన్ ఉన్నప్పుడు ఇప్పటికే భక్తి గీతాల్లో బాగా వినిపించిన ‘సియారామ్’ ఫీల్ ని ఎందుకు నమ్ముకున్నారు అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఈ పాటలో విజువల్స్ మాత్రం ఆసక్తిని పెంచుతున్నాయి. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి కనిపించే సీన్స్ లో వారి మధ్య ఉన్న అనుబంధాన్నే సీతారాముల కళ్యాణ వైభవాన్ని అందంగా చూపించారు. ముఖ్యంగా సాయి పల్లవి లుక్ పై వచ్చిన ట్రోలింగ్ కు ఈ పాటలోని విజువల్స్ కొంత సమాధానంలా కనిపిస్తున్నాయి. దాదాపు 4 వేల కోట్ల భారీ బడ్జెట్, ప్రపంచ స్థాయి విఎఫ్ఎక్స్ ‘రామాయణ’ను సాధారణ సినిమాగా కాకుండా గ్లోబల్ స్పెక్టాకిల్ గా మార్చేసాయి. అందుకే ‘జై జై రామ్’ పాట నుంచి కూడా ప్రేక్షకులు సాధారణ భక్తి పాట కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఆశిస్తున్నారు. విజువల్స్ పరంగా సాంగ్ ఆకట్టుకున్నా, మ్యూజిక్ లో కొత్తదనం కంటే పరిచయమైన భక్తి ఫీల్ ఎక్కువగా ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
- Varanasi Movie: 'వారణాసి'లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
- Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
తాజావార్తలు
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?