Site icon NTV Telugu

Ramarao On Duty : రిలీజ్ డేట్ లాక్… ఎప్పుడంటే ?

Rama-Rao-on-Duty

Ramarao On Duty మాస్ మహారాజా రవితేజ నెక్స్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ లాక్ చేశారు. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ” చిత్రంలో దివ్యాంశా కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. వేణు తొట్టెంపూడి, నాజర్, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్ మరియు ఇతరులు కూడా ఈ హై-వోల్టేజ్ యాక్షన్ మూవీలో భాగం అయ్యారు. ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టీ టీమ్‌ వర్క్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ చిత్రానికి సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సామ్ సిఎస్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంది స్పందన వచ్చింది. తాజాగా Ramarao On Duty రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు.

Read Also : RRR : మరో రికార్డు… సెకండాఫ్ కంటే ఫస్టాఫ్ ఎక్కువ !?

Ramarao On Duty చిత్రం ఈ ఏడాది జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రకటించారు. ఈ మేరకు విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో రవితేజ గంభీరంగా కనిపిస్తున్నాడు. ఇందులో కొన్ని భారీ రవాణా వాహనాలు అడవి గుండా వెళ్తున్నట్టు కన్పించడం గమనించవచ్చు. తాజాగా విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఇక ఇటీవలే ‘ఖిలాడీ’గా థియేటర్లలోకి వచ్చి ఏమాత్రం అలరించలేకపోయిన రవితేజ ఈ చిత్రంతోనైనా అంచనాలను అందుకుంటాడేమో చూడాలి.

Exit mobile version