Site icon NTV Telugu

Ramarao On Duty: రామారావు డిజిటల్ హక్కులు దక్కించుకున్న ప్రముఖ ఓటిటీ సంస్థ

raviteja

raviteja

మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలను లైన్లో పెట్టి జోష్ పెంచేశాడు. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో రవితేజ నటిస్తున్న సంగతి తెల్సిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రవితేజ సరసన  దివ్యాంక కౌశిక్ మరియు రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా మార్చి 1న టీజర్‌తో పాటు విడుదల తేదీని ఖరారు చేయనున్నారని సమాచారం.

ఇకపోతే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని  సోనీ లైవ్ దక్కించుకుంది. భారీ ధరను వెచ్చించి ఈ సినిమాను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. ఖిలాడీ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న మాస్ మహారాజా ఈ సినిమాతో హిట్ ని అందుకుంటాడేమో చూడాలి.

Exit mobile version